దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం సరికొత్త ప్రణాళికను అమలు చేయనుందని తెలుస్తోంది. దేశంలో ఇకపై సింగల్ సిగరెట్ విక్రయాల్ని నిషేధించడమే ఆ ఆలోచన. ఇప్పటికే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పలు సిఫార్సులు సూచించింది. దీని ప్రకారం త్వరలో దేశంలో 1-2 సిగరెట్ అంటే విడివిడిగా సింగల్ సిగరెట్ అమ్మకాలపై నిషేధం పడనుంది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్నించి సిగరెట్ స్మోకింగ్ జోన్లను కూడా తొలగించనుంది. స్మోకింగ్ కారణంగా దేశంలో ఏడాదికి 3.5 లక్షలమంది మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ చేసిన సర్వేలో ధూమపానం చేసేవారిలో 46 శాతం నిరక్షరాస్యులు కాగా, 16 శాతం మంది కళాశాళ విద్యార్ధులున్నారు. దేశంలో ప్రతియేటా 6.6 కోట్లమంది సిగరెట్ తాగుతున్నారు. 26 కోట్లమంది ఇతర పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. అదే సమయంలో సిగరెట్ కారణంగా దేశంలో 21 శాతం మందికి కేన్సర్ సోకుతోంది. 


జీఎస్టీ అమలయ్యాక కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నుపెద్దగా పెరగలేదని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గుర్తించింది. పొగాకు ఉత్పత్తులపై 75 శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భారత ప్రభుత్వాన్ని కోరింది. ఇదే అమలైతే సిగరెట్ ఇక మరింత ఖరీదు కానుంది. 1-2 సిగరెట్లు కొనలేరిక. ప్యాకెట్ కొనాల్సిందే.


Also read: Best Mileage Bikes: తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ బైక్స్ ఇవే! దేశాన్ని కూడా చుట్టేయొచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook