EPFO Rule: ఈపీఎఫ్ఓలో 27 కోట్లకు పైగా ఖాతాదారులున్నారు. వైద్య అవసరాల కోసం ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే అడ్వాన్స్ తీసుకునేందుకు వీలుంటుంది. ఈ నిబంధనలో ఈపీఎఫ్ఓ ఇప్పుడు మార్పు తీసుకొచ్చింది. ఏప్రిల్ 16 నుంచి ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెంట్రల్ ప్రోవిడెంట్ ఫండ్ కమీషనర్ నుంచి ఆమోదం లభించగానే ఈపీఎఫ్ఓలో మార్పులు చేశారు. ఏదైనా తీవ్రమైన వ్యాధి చికిత్స లేదా వైద్య అవసరాల కోసం పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే సౌకర్యం ఉంది. తన కోసం లేదా తన కుటుంబసభ్యుల వైద్య అవసరాల కోసం అడ్వాన్స్ రూపంలో డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు. వైద్య అవసరాల కోసం 1 లక్ష రూపాయల వరకూ నగదును 68జే ప్రకారం ఎక్కౌంట్ హోల్డర్ పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి తీసుకోవచ్చు. 6 నెలల కనీస వేతనం, డీఏ లేదా వడ్డీతో కలిపిన ఉద్యోగి వాటా ఏది తక్కువైతే అది అప్లై చేయవచ్చు. ఫామ్ 31 ద్వారా కూడా అడ్వాన్స్ మొత్తం తీసుకోవచ్చు. అయితే దీనికోసం డాక్టర్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. 


పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి చికిత్స కోసం డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.in ఓపెన్ చేయాలి. తరువాత ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకుని సంబంధిత క్లెయిమ్ ఫామ్ నింపాలి. ఇప్పుడు మీ పీఎఫ్ ఎక్కౌంట్ చివరి 4 నెంబర్లు ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఆ తరువాత ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్ క్లిక్ చేసి ఫామ్ 31 నింపాలి. ఆ తరువాత మీ ఎక్కౌంట్ వివరాలు నింపి బ్యాంక్ చెక్ లేదా పాస్‌‌బుక్ సాఫ్ట్ కాపీ అప్‌లోడ్ చేయాలి. ఆధార్ ఓటీపీ ధృవీకరించుకోవాలి. 


Also read: Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్‌డేట్ చేయకపోతే పనిచేస్తుందా లేదా, వాస్తవమేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook