Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్‌డేట్ చేయకపోతే పనిచేస్తుందా లేదా, వాస్తవమేంటి

Aadhaar Card Update: ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అందుకే ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు అప్‌డేట్ అవుతుండాలి. మీ ఆధార్ కార్డు పదేళ్ల పాతదైతే తప్పకుండా అప్‌డేట్ చేయించాల్సిందే. లేనిపక్షంలో ఆధార్ కార్డు పనిచేస్తుందా లేదా అనేదే ఇప్పుడు సందేహం. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2024, 02:13 PM IST
Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్‌డేట్ చేయకపోతే పనిచేస్తుందా లేదా, వాస్తవమేంటి

Aadhaar Card Update: చాలామంది ఆధార్ కార్డు తీసుకున్న తరువాత అప్‌డేట్ చేయకుండా వదిలేస్తుంటారు. ఇళ్లు మారినా, ఫోన్ నెంబర్ మారినా లేదా పిల్లల బయోమెట్రిక్ మార్చాల్సి వచ్చినా పట్టించుకోరు. దీనివల్ల కొన్ని విషయాల్లో సమస్య ఏర్పడవచ్చు. ముఖ్యంగా సంక్షేమ పథకాల లభ్ది, ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ పని పడినప్పుడు ఆధార్ అప్‌డేట్ కాకుండా ఉంటే ఇబ్బంది ఎదురుకావచ్చు. 

ఆధార్ అనేది ఇటీవలి కాలంలో ప్రతి పనికీ అవసరమౌతుంది. రేషన్ కార్డు, పాన్‌కార్డ్ ఇతర దస్తావేజులు, ఎక్కౌంట్లతో లింక్ కావల్సి ఉంటుంది. ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తుంటుంది. కొన్ని సోషల్ మీడియాలో వస్తుంటాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజం కాకపోవచ్చు సగం అవాస్తవాలే ఉంటాయి. అదే విధంగా పదేళ్లనాటి ఆధార్ అప్‌డేట్ చేయకుంటే ఇక పనిచేయదనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం. యూఐడీఏఐ చాలాసార్లు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆధార్ అప్‌డేట్ అనేది అనివార్యం కాదు కానీ చేయించుకుంటే మంచిది. 

ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు గుర్తింపు కార్డు, అడ్రస్ కోసం అప్‌డేట్ చేయించుకోవవల్సి ఉంటుంది. పదేళ్ల నాటి ఆధార్ కార్డులో అడ్రస్ , ఫోటో వంటివి మార్చుకుంటే భవిష్యత్తులో ఏదైనా పని పడినప్పుడు ఇబ్బంది తలెత్తకుండా ఉంటుంది. అప్‌డేట్ చేయకపోయినంతమాత్రాన ఆధార్ పనిచేయకుండా పోదు. 

మీ ఆధార్ కార్డు కూడా పదేళ్ల నాటిదైతే ఈలోగా అడ్రస్ లేదా ఊరు మారితే అప్‌డేట్ చేయించుకోవడం మంచిది. లేకపోతే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురౌతాయి. ఆధార్ కారణంగా ఆ పని ఆగిపోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఇంట్లో కూర్చుని ఆధార్ అప్‌డేట్ చేయించుకోవచ్చు. దీనికోసం ముందుగా myaadhaar.uidai.gov.in సైట్ ఓపెన్ చేయాలి. మీకు అప్‌డేట్ చేయాల్సిన ఆప్షన్ ఎంచుకుని అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సమర్పించాలి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీకు ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదు. అడ్రస్ మారితే మాత్రం అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది. 

Also read: Jio Cricket Recharge Plans: ఐపీఎల్ 2024 క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ జియో యూజర్లకు డేటా ప్యాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News