7th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
7th Pay Commission Latest News: కొన్ని విభాగాల అధికారులకు వైద్య నివేదిక సమర్పించడానికి కాలపరిమితిని పొడిగించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితుల దృష్ట్యా మెడికల్ రిపోర్ట్ సమర్పించేందుకు గడువు పొడిగించారు.
ఏడవ వేతన సంఘం ఇటీవల కీలక ప్రతిపాదనలు చేసింది. జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డీఏ బెనిఫిట్స్ పొందనున్నారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రస్తావించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి మరో నిర్ణయం తీసుకుంది.
కొన్ని విభాగాల అధికారులకు వైద్య నివేదిక సమర్పించడానికి కాలపరిమితిని పొడిగించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితుల దృష్ట్యా మెడికల్ రిపోర్ట్ సమర్పించేందుకు గడువు పొడిగించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రకారం, వీవై ఏఐఎస్ అధికారులు 2020-21 సంవత్సరానికిగానూ వైద్య నివేదిక సమర్పించడానికి తుది గడువును 7th Pay Commission సూచన ప్రకారం జూన్ 30, 2021 వరకు పొడిగించారు.
ఎప్పటికప్పుడు సవరిస్తున్న AIS (PAR) నిబంధనలు 2007 ప్రకారం నిర్దేశించిన కాలపరిమితి, రికార్డింగ్ మరియు PAR ప్రతిసందర్భంలోనూ మార్చరని DoPT కమ్యూనికేషన్ తెలిపింది. 40 ఏళ్లు పైబడిన అందరూ AIS అధికారులకు ఆరోగ్య తనిఖీ తప్పనిసరి అని భారత ప్రభుత్వ సెక్రటరీ దేవేంద్ర కుమార్ అన్నారు. పైన పేర్కొన్న నిబంధనలకు సైతం తాను మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. వార్షిక ఆరోగ్య పరీక్ష AIS (PAR) నిబంధనలు 2007 ప్రకారం సూచించిన ఫారం IV సమర్పించాలి.
PARతో పాటు జతచేయవలసిన వైద్య నివేదిక పార్ట్ సి సంబంధిత కాపీని సమర్పించాలి. నిబంధనల ప్రకారం సంబంధిత అధికారి ఆరోగ్య తనిఖీ చేసిన తరువాత సొంతంగా అంచనా వేసిన మెడికల్ రిపోర్ట్ వివరాలు, సంబంధిత వివరాలు అప్పగించాలని చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన మూడు డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance)ను క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉంది.
పెండింగ్‌లో ఉన్న మూడు వాయిదాలను పునరుద్ధరించడంతో పాటు జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ యొక్క పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల తెలిపారు.
01.07.2021 నుండి డియర్‌నెస్ అలవెన్స్‌ను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న సమయంలో 01-01-2020, 01-07-2020 మరియు 01-01-2021 పెండింగ్ డీఏను సైతం అమలు చేయనుంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ లాంటి కారణాలతో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, డీఆర్ నిలిపివేశారు. జూలై 1 నుంచి సవరించిన డీఏ రేట్లు ప్రభుత్వ ఉద్యోగులు అందుకోనున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook