Payments Bank Limit: పేమెంట్స్ బ్యాంక్ లిమిట్ రెట్టింపు చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇకనుంచి రూ.2 లక్షలు

Digital Payments Bank Limit: భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) శుభవార్త అందించింది. డిజిటల్ పేమెంట్స్ బ్యాంకులలో డిపాజిట్ పరిమితిని రెట్టింపు చేసి చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి పేమెంట్స్ బ్యాంకులో డిపాజిట్, బదిలీ పరిమితిని రూ.2 లక్షల వరకు పెంచింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 8, 2021, 02:38 PM IST
  • డిజిటల్ పేమెంట్స్ బ్యాంకులలో మీరు ఖాతాదారులా, అయితే మీకు శుభవార్త
  • పేటీఎం, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు రూ.2 లక్షలకు లిమిట్ పెంపు
  • కరోనా వ్యాప్తి సమయంలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహిస్తున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్
Payments Bank Limit: పేమెంట్స్ బ్యాంక్ లిమిట్ రెట్టింపు చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇకనుంచి రూ.2 లక్షలు

Payments Bank Limit: డిజిటల్ పేమెంట్స్ బ్యాంకులలో మీరు ఖాతాదారులా, అయితే మీకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) శుభవార్త అందించింది. డిజిటల్ పేమెంట్స్ బ్యాంకులలో డిపాజిట్ పరిమితిని రెట్టింపు చేసి చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి పేమెంట్స్ బ్యాంకులో డిపాజిట్, బదిలీ పరిమితిని రూ.2 లక్షల వరకు పెంచింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. 

డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడంలో భాగంగా బ్యాంకర్స్ బ్యాంక్ ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కేవలం లక్ష రూపాయాల వరకే పరిమితి ఉండటంతో చిరు వ్యాపారులకు, సాధారణ వ్యాపారులకు ఇబ్బందిగా ఉండేదని, నేటి నుంచి వారికి ఆర్‌బీఐ తాజా నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పేటీఎం, ఎయిర్​టెల్ పేమెంట్స్ బ్యాంక్స్ ఖాతాదారులు ఇక నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ పరిమితి, ట్రాన్సాక్షన్ లిమిట్ ప్రయోజనాలు పొందనున్నారు. ఎప్పటినుంచో పేమెంట్స్ బ్యాంక్స్ వినియోగదారులు కోరుతుండగా తాజాగా వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆర్‌బీఐ(Reserve Bank Of India) తీసుకుంది.

Also Read: COVID-19 Cases India: భారత్ ప్రయాణికులపై నిషేధం విధించిన న్యూజిలాండ్, కోవిడ్19 భయం

ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపోరేటు 3.35 శాతంగా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అదే క్రమంలో పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సేవలను నాన్ బ్యాంకింగ్ ఖాతాదారులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం(Paytm), ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ లాంటివి నాన్ బ్యాంకింగ్ విభాగం కిందకి వస్తాయని తెలిసిందే. 

నాన్ బ్యాంకింగ్ కస్టమర్లు, సిస్టమ్ ఆపరేట్లు ఇకపై ఆర్టీజీఎస్, నెఫ్ట్ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రాధాన్యత రంగ రుణాల కింద రైతులకు రుణాల పరిమితిని రూ.50 లక్షల రూపాయల నుంచి రూ.75 లక్షలకు పెంచింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సహిస్తుంది.

Also Read: Gold Price Today 08 April 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News