Special Festival Advance Scheme: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలో గుడ్​ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. హోలీ పండుగ నేపథ్యంలో ఉద్యోగులకు మరోసారి ఫెస్టివల్​ అడ్వాన్స్ స్కీమ్​ను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏమిటి ఈ అడ్వాన్స్ స్కీమ్​?


కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ ఒడొడుదుకులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వ్యవస్థలో వినియోగం తగ్గింది. చేతిలో డబ్బులు ఉంటే.. వాటిని వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉద్యోగులకు రూ.10 వేలు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని పది వాయిదాల్లో రూ.1000 చొప్పున తిరిగి రికవరీ చేయనుంది.


వడ్డీ లేకుండా ఒకేసారి రూ.10 వేలు వస్తే ఏదైనా వస్తువు కొనడం లేదా.. ప్రయాణాలపై ఖర్చు చేసే అవకాశాలుంటాయని అంటున్నారు విశ్లేషకులు. ఇంతకు ముందు కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. గత ఏడాది ఫెస్టివల్ అడ్వాన్స్ పథకం కోసం కేంద్రం రూ.4 వేల కోట్లు ఖర్చు చేసింది.


అయితే ఈ విషయంపై ఇంకా ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనిపై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుని.. పూర్తి వివరాలు వెల్లడించే వీలుంది.


Also read: Corbevax vaccine: పిల్లలకూ కొర్బీవాక్స్​- డీసీజీఐ అనుమతులు మంజూరు!


Also read: Flipkart Sale: ఫ్లిప్​కార్ట్ కూల్ ఆఫర్స్.. రూ.12 వేల కూలర్ కేవలం రూ.7,515కే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook