Budget 2021 Live Updates: కరోనా వైరస్ తర్వాత ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కావడంతో కేంద్ర బడ్జెట్ 2021పై సామాన్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సామాన్యుల ఆశలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  నీల్లు చల్లారు. ఇప్పటికే నిరుద్యోగం, ఉన్న జాబ్ కోల్పోయి సమస్యలు, పెరుగుతున్న ధరలను భరించలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులపై పెట్రో పిడుగు పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అధిక ధరలతో చుక్కలు చూస్తున్న సామాన్యులు, మధ్య తరగతి వారిపై పెట్రోల్, డీజిల్ ధరు ఇకనుంచి మరింత భారంగా మారనున్నాయి. పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 అగ్రికల్చర్ ఇన్‌ఫ్రా సెస్‌ విధించినట్లు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సంచలన ప్రకటన చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా పలు నగరాలలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటనుంది. ఇదివరకే డీజిల్ సైతం కొన్ని ప్రాంతాల్లో రూ.100కు చేరడం తెలిసిందే.


 


Also Read: Pradhan Mantri Awas Yojana: ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన PMAYపై Budget 2021లో శుభవార్త


 


కాగా, గత కొంతకాలం వరకు దేశంలోనే అధిక డీజిల్ ధరలు హైదరాబాద్ నగరంలో నమోదయ్యాయి. తాజా బడ్జెట్ అనంతరం పెరగనున్న ధరలు వాహనదారులను, సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఊరట కలిగించే విషయాల కోసం ఎదురుచూసిన వారికి కేంద్రం, నిర్మలా సీతారామన్ షాకుల మీద షాకులు ఇచ్చారని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.


Also Read: Union Budget 2021: సామాన్యుల కోసం సరికొత్త స్కీమ్.. Aatma Nirbhar Health Yojanaకు రూ.64 వేల కోట్లు కేటాయింపు


 


మరోవైపు ఆత్మ నిర్భర్ హెల్త్ యోజన అనే ఆరోగ్య పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. తాజా బడ్జెట్ 2021(Budget 2021 Latest News)లో ఇందుకోసం ఏకంగా రూ.64,180 కోట్లు కేటాయించారు. వచ్చే ఆరేళ్లలో సామాన్యుల ఆరోగ్యం కేసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వెచ్చించనుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.


Also Read: Budget 2021: కరోనా వ్యాక్సిన్ కోసం Budget 2021లో భారీ కేటాయింపులు, వైరల్ ల్యాబ్‌లు


 


అంతకుముందు కేంద్ర కేబినెట్ ఈ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. నేటి (ఫిబ్రవరి 1, 2021న) ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ 2021ను ప్రవేశపెట్టారు. కరోనా వ్యాక్సిన్ కోసం, ఆరోగ్యం కేసం ప్రధానంగా కేటాయింపులు జరిగాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook