Cheap & Best Automatic SUV Cars: ఇండియాలో తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ SUV కార్లు
Cheap & Best Automatic SUV Cars: ఇండియాలో అత్యంత సరసమైన ధరలకే లభించే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన SUV కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కేవలం రూ. 7.5 లక్షల ఎక్స్-షోరూమ్ ధర నుండి ప్రారంభమైతే 10 లక్షల రూపాయల వరకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన SUV కార్లు ఇండియన్ మార్కెట్లో కొన్నే ఉన్నాయి.
Cheap & Best Automatic SUV Cars: ఇండియాలో అత్యంత సరసమైన ధరలకే లభించే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన SUV కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కేవలం రూ. 7.5 లక్షల ఎక్స్-షోరూమ్ ధర నుండి ప్రారంభమైతే 10 లక్షల రూపాయల వరకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన SUV కార్లు ఇండియన్ మార్కెట్లో కొన్నే ఉన్నాయి. ఆ బితాలో ఏయే కార్లు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం రండి.
టాటా పంచ్ :
మన దేశంలో అత్యంత సరసమైన ధరలకే లభిస్తున్న ఆటోమేటిక్ SUV, AMT గేర్‌బాక్స్ కలిగిన కార్లలో టాటా పంచ్ ఒకటి. 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ కలిగిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 7.5 లక్షలు మాత్రమే.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ :
అత్యంత సరసమైన ధరలకే లభించే ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన SUV కార్ల జాబితాలో ఉన్న రెండో కారు హ్యుందాయ్ ఎక్స్‌టర్. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఆప్షనల్ AMTతో వస్తోన్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.97 లక్షలుగా ఉంది.
రెనాల్ట్ కైగర్ :
తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన ఎస్‌యూవీ కార్లలో మూడో స్థానంలో ఉన్న కారు రెనాల్ట్ కైగర్. 1.0 లీటర్ NA పెట్రోల్ ఇంజన్, AMT గేర్ బాక్స్ కలిగిన రెనాల్ట్ కైగర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 8.55 లక్షలు గా ఉంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ :
ఈ ఏడాది ఆటో ఎక్స్ పోలో కనువిందు చేసిన మారుతి సుజుకి కార్లలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కూడా ఒకటి. మారుతి సుజుకి బెలెనో డిజైన్ ఆధారంగా రూపొందిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌తో AMT గేర్‌బాక్స్‌తో వస్తోంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.88 లక్షలు నుండి ప్రారంభం అవుతోంది.
ఇది కూడా చదవండి : Upcoming Electric Cars: త్వరలోనే ఇండియాలో ఎంట్రీ ఇవ్వనున్న ఎలక్ట్రిక్ కార్స్ లిస్ట్ ఇదిగో
నిస్సాన్ మాగ్నైట్ :
నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగిన నిస్సాన్ మాగ్నైట్ కారు ఎక్స్-షోరూం ప్రారంభ ధర రూ. 10 లక్షలు వద్ద ప్రారంభం అవుతోంది.
ఇది కూడా చదవండి : Selling Your Used Car: మీ పాత కారుకు మంచి ధర రావాలంటే ఏం చేయాలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి