Upcoming Electric Cars: త్వరలోనే ఇండియాలో ఎంట్రీ ఇవ్వనున్న ఎలక్ట్రిక్ కార్స్ లిస్ట్ ఇదిగో

Upcoming Electric Cars In India: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు కస్టమర్స్ నుండి వస్తున్న ఆధరణను దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ కంపెనీలు కూడా పోటాపోటీగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.

Written by - Pavan | Last Updated : Sep 22, 2023, 08:10 PM IST
Upcoming Electric Cars: త్వరలోనే ఇండియాలో ఎంట్రీ ఇవ్వనున్న ఎలక్ట్రిక్ కార్స్ లిస్ట్ ఇదిగో

Upcoming Electric Cars In India: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు కస్టమర్స్ నుండి వస్తున్న ఆధరణను దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ కంపెనీలు కూడా పోటాపోటీగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏదైనా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. ఆ టెక్నాలజీ కలిగిన కార్లు ఇండియాకు ఇంపోర్ట్ అయ్యే వరకు వేచిచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇండియాలోనే ఎలక్ట్రిక్ వాహనాలు రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలో టాటా మోటార్స్ అందరికంటే ముందు వరుసలో ఉంది. 

ఎక్కువ మోడల్స్ తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడమే కాకుండా.. వాటికి డిమాండ్ ఉండేలా చూసుకోవడంలోనూ టాటా మోటార్స్ సక్సెస్ అయింది అనే చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ నుంచే కాకుండా ఎంజీ మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా, హ్యూందాయ్ ఇండియా వంటి కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తమ ప్రజెన్స్ చూపించుకుంటున్నాయి. ఇప్పటికే మార్కెట్లో చాలావరకు ఎలక్ట్రిక్ కార్లు ఉండగా.. త్వరలోనే మరో 5 ఎలక్ట్రిక్ కార్లు ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. అవేంటో చూద్దాం రండి. 

టాటా పంచ్ EV :
మన దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చాలా అగ్రెసివ్‌గా దూసుకుపోతోంది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్ EV. టాటా టిగోర్ EV, టాటా టియాగో EV వంటి ఎలక్ట్రిక్ కార్లు ఉండగా.. త్వరలోనే టాటా పంచ్ EV కూడా మార్కెట్లోకి రాబోతోంది.

మహింద్రా XUV.e8 :
టాటా మోటార్స్ తరువాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చాలా అగ్రెసివ్‌గా పనిచేస్తోన్న మరో కంపెనీ మహీంద్రా అండ్ మహింద్రా. ఇండియాలో సరసమైన ధరలకే ఎలక్ట్రిక్ కార్లు అందించేందుకు కృషి చేస్తోన్న మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ మహీంద్రా e2O, e2O ప్లస్‌ కార్ల తయారీతో బిజీగా ఉంది. ఈమధ్యే మహీంద్రా నుండి మహింద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV కారు మార్కెట్లోకి వచ్చింది. తాజాగా XUV700 ఆధారంగా రూపొందిస్తున్న మహీంద్రా XUV.e8 కూడా త్వరలోనే లాంచ్ కానుంది. డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో 80 kWh బ్యాటరీని అమర్చారు.

టాటా కర్వ్ EV : 
టాటా మోటార్స్ నుండి వస్తోన్న మరో ఎలక్ట్రిక్ కారు టాటా కర్వ్వ్ EV. ఢిల్లీలో 2023 ఏడాది ఆరంభంలోనే జరిగిన ఆటో ఎక్స్‌పోలో తళుక్కుమన్న టాటా కర్వ్ EV కూపే డిజైన్‌ను పోలి ఉంటుంది. దాదాపు 500 నుండి 550 కిమీల రేంజ్‌ ఇచ్చే విధంగా టాటా కర్వ్ EV ని డిజైన్ చేశారు. టాటా పంచ్ EV, టాటా కర్వ్ EV లతో త్వరలోనే టాటా మోటార్స్ బిజినెస్ మరింత వెలిగిపోనుంది. 

కియా EV9 : 
2023 ఆటో ఎక్స్‌పోలో దర్శనం ఇచ్చిన 7 సీటర్ కారు కియా EV9 కూడా ఇండియాలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్లో సందడి చేస్తోన్న Kia EV9 కారు త్వరలోనే ఇండియన్ రోడ్స్ పై కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. 541 కిమీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ ఇస్తున్నట్టు కియా కంపెనీ స్పష్టంచేసింది. అల్ట్రా-ఫాస్ట్ 800V ఛార్జింగ్ సామర్ధ్యం కలదు. ఇండియాలో కియా ఎలక్ట్రిక్ కార్లలో ఇది రెండోది కానుంది.

ఇది కూడా చదవండి : Selling Your Used Car: మీ పాత కారుకు మంచి ధర రావాలంటే ఏం చేయాలో తెలుసా ?

న్యూ హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్ EV : 
దక్షిణ కొరియా ఆటోమేకర్ దిగ్గజం హ్యుందాయ్ నుండి హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. 450 కిమీ కంటే ఎక్కువ రేంజ్ కలిగిన హ్యుందాయ్ కోనాకు లేటెస్ట్ వెర్షన్ కూడా త్వరలోనే లాంచ్ అవనుంది. అంతేకాకుండా ఐయోనిక్ 6, కోన EV కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Top 5 Best Selling Hatchbacks: దేశంలో హ్యాచ్‌బ్యాక్ కార్లకు పెరుగుతున్న ఆదరణ, టాప్ 5లో ఉన్న కార్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News