Lifetime Validity Plan: రూ. 225కే లైఫ్ టైం వాలిడిటీ.. ఈ ఆఫర్ ఎయిర్‌టెల్, జియోలో మాత్రం కాదు!
MTNL Rs 225 Lifetime Validity Prepaid Plan. ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్ తమ వినియోగదారులకు అతి తక్కువ ధరలో లైఫ్ టైం ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
MTNL Rs 225 Lifetime Validity Prepaid Plan: ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని అరచేతిలో చూపించే 'స్మార్ట్‌ఫోన్' లేని వారు ఎవరూ ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఉంటే తప్పనిసరిగా రీఛార్జ్ చేయాల్సిందే. ప్రతి నెల, మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడూ రీచార్జ్ చేయడం కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికోసం లైఫ్ టైం వాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ జియో, ఎయిర్‌టెల్ మరియు విఐలలో మాత్రం లేదు.
ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్ తమ వినియోగదారులకు అతి తక్కువ ధరలో లైఫ్ టైం ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 225 లకే లైఫ్ టైం వాలిడిటీని అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా మీరు నిత్యం రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా పోతుంది. రూ. 225 రూపాయల ఈ ప్లాన్ వన్-టైమ్ ఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది సిమ్, ఖాతా మరియు టారిఫ్ యొక్క జీవితకాల చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో కాల్ చేయడానికి 100 నిమిషాలు మాత్రమే ఉన్నాయి.
100 నిమిషాల అనంతరం కాల్ చేయడానికి డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. వాయిస్ కాల్స్ సెకనుకు 0.02 పైసల చొప్పున మరియు వీడియో కాలింగ్ నిమిషానికి రూ. 0.60 అవుతుంది. రోమింగ్ అవుట్ గోయింగ్ కాల్‌కు రూ. 0.80 మరియు వీడియో కాల్‌కు నిమిషానికి 375 పైసలు ఛార్జ్ అవుతుంది. ఈ ప్లాన్‌లో ఇతర ప్రయోజనాలు ఏవీ ఉండవు. మొబైల్ డేటా వినియోగించని వారికి ఈ ఆఫర్ బెటర్.
Also Read: Viral Video: వధువును టచ్ చేసినందుకు.. స్టేజీ పైనే ఫోటోగ్రాఫర్‌ను చాచిపెట్టి కొట్టిన వరుడు
Also Read: Ranji Trophy 2022: సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా ఉండడం బాగుంది: యువ క్రికెటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook