Cheapest Recharge Plan Offering 1GB Data In Just 2 Rupees: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. పలు రకాల ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్లలో ఇతర నెట్‌వర్క్‌లకు ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని ప్రారంభించడం అందుకు నిదర్శనం. మీరు అతి చౌకైన డేటా ప్లాన్‌ల కోసం చూస్తున్నారా.. అయితే ఈ వివరాలు మీకోసమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రూ.2కే 1 జీబీ డేటా ప్లాన్ పొందండి 
ఓ రీఛార్జ్ ప్లాన్ కింద మీరు కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు. దాంతోపాటు పలు ప్రయోజనాలు ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా(Vodafone Idea) 449 రూపాయలకు రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 56 రోజులు ఉంటుంది. ఇందులో Vi వారు డబుల్ డేటాను అందిస్తున్నారు. అంటే  ఐడియా-వొడాఫోన్ ఈ ప్లాన్(Cheapest Recharge Plans)‌పై ప్రతిరోజూ 2GB డేటాకు బదులుగా 4GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వినియోగదారులు మొత్తంగా 224 జీబీ డేటాను పొందనున్నారు. 


Also Read: How To Secure Whatsapp: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్



మీరు రూ.449తో రీఛార్జ్ చేసుకున్నారు. కదా మొత్తం 224 GB డేటాను పొందారు అంటే మీకు 1 జీబీ డేటా కేవలం రూ.2కు లభిస్తుంది. ఇది తక్కువ ధరలకు డేటా అందిస్తున్న Vodafone Idea రీఛార్జ్ ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ వాడేవారు ఏదైనా నెట్‌వర్క్ నంబర్‌కు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఉచిత SMS లభిస్తాయి. వీటితో పాటు మీరు Vi సినిమాలు మరియు TV ని ఉచితంగా వీక్షించవచ్చు. వీకెండ్ డేటా రోల్ఓవర్ కూడా ఈ ప్లాన్‌కు వర్తిస్తుంది.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన



2.08 రూపాయలకు 1GB డేటా
వోడాఫోన్-ఐడియా యొక్క రూ.699 ప్లాన్ ద్వారా 1GB డేటాను కేవలం 2.08 రూపాయలకు పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. మొత్తం 336 GB డేటాను అందిస్తోంది వీఐ నెట్‌వర్క్. వారాంతపు డేటా రోల్‌ఓవర్‌తో పాటు ఉచిత కాలింగ్, ఉచిత SMS, ఉచిత Vi సినిమాలు మరియు ఉచితంగా టీవీ వీక్షించడం లాంటి ప్రయోజనాలు పొందుతారు. 


Also Read: WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook