PAN Card: ‘పాన్ కార్డ్’ అనేది బ్యాంకింగ్(Banking), ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు నిర్వహించేందుకు అతి కీలకమైన డాక్యుమెంట్. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఈపీఎఫ్(EPF) డబ్బు డిపాజిట్ చేసినా పాన్ తప్పనిసరి. పాన్ లేకుండా ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలనూ నిర్వహించలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ కారణంగా.. ప్రజలు తప్పనిసరిగా చాలా చోట్ల పాన్ కార్డ్ వివరాలను అందించాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, పాన్(PAN Card) వివరాలు ఎక్కడెక్కడ ఇచ్చారో గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ప్రజలపై ఉంది. ఎందుకంటే ఇంతటి కీలకమైన పాన్ కార్డును కొందరు కేటుగాళ్లు దుర్వినియోగపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే.. మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతుందా? దాని సాయంతో ఏదైనా మోసం జరుగుతోందా? అని తెలుసుకోవడం చాలా కీలకం.


ఐటీశాఖకు ఇది చాలా ముఖ్యం
పాన్ కార్డ్ అనేది వ్యక్తిగతంగా చాలా కీలకమైనది. దీనిని భద్రంగా ఉంచుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ(Income Tax department) కు సంబంధించి ప్రతీ పనికి ఇది అవసరం. అందుకే మీ ‘పాన్’ విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. రుణాలు, అప్పుల విషయాన్ని పక్కన పెడితే.. చాలా చిన్న చిన్న వాటికి కూడా పాన్ తప్పనిసరి అయ్యింది. రైల్వేలో హోటల్స్ బుక్ చేయాలన్నా.. తత్కాల్ టిక్కెట్లు తీసుకోవాలన్నా.. పాన్ కార్డు తప్పనిసరి. కొన్నిసార్లు సిమ్ కార్డు తీసుకోవటానికి కూడా పాన్ కార్డ్ అవసరం పడుతుంది. అయితే, పాన్ కార్డు వివరాలను ఇచ్చిన తరువాత మనం వాటిని పెద్దగా పట్టించుకోము. కానీ, మీ పాన్ వివరాలు దుర్వినియోగం అవుతున్నాయా? లేదా? అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.


Also Read: ​Income Tax Jobs 2021: రూ.1,42,000 వేతనంతో ఆదాయపు పన్ను శాఖలో జాబ్స్!


ఈ 3 ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోండి..
ఇక్కడ 3 రకాల ప్రశ్నలు తలెత్తుతాయి. PAN ని దుర్వినియోగం చేయవచ్చా?.. అవును అయితే, నేను దానిని ఎలా నివారించొచ్చు?, పాన్ దుర్వినియోగం కావడం లేదని మనం ఎలా గుర్తించాలి?.. మీ పాన్ వివరాలు మోసపూరితమైన వ్యక్తి చేతిలో ఉంటే అది దుర్వినియోగం అవడం దాదాపు ఖయం. గతంలో ఒక వ్యక్తి యొక్క పాన్ వివరాలను ఉపయోగించి భారీ మోసాలకు పాల్పడిన ఘటను కోకొల్లలు ఉన్నాయి. తక్కువ మొత్తంలో సంపాదిస్తున్న వ్యక్తిని పెద్ద కంపెనీకి ప్రమోటర్‌గా పేర్కొన్నారు. ఆ వ్యక్తి PAN ఆధారంగా భారీ స్థాయిలో రుణాలు తీసుకున్నారు. తీరా విషయం తెలిసి అధికారులు, బాధిత వ్యక్తులు షాక్‌కు గురయ్యారు.


ఎలా చెక్ చేసుకోవాలంటే...
PAN దుర్వినియోగం గురించి తెలుసుకోవడానికి మీరు ఫారం 26AS ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిని ఆదాయపు పన్ను పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిని TRACES పోర్టల్ నుండి కూడా తీసుకోవచ్చు. ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అన్ని లావాదేవీలను చెక్ చేయవచ్చు. తద్వారా మీ పాన్ కార్డ్ దుర్వినియోగమయ్యిందా? సరిగ్గానే ఉందా? అనేది తెలుసుకోవచ్చు.


PAN తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఉపయోగించండి. అంటే, పాన్ ఇవ్వకుండా పని జరగదు అన్న చోట మాత్రమే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. లేదంటే పాన్ వివరాలను అస్సలు ఇవ్వొద్దు. ఏదైనా ఇతర ఐడీ ఇవ్వడం ద్వారా పని చేయగలిగితే, పాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పాన్ హార్డ్ కాపీని ఇస్తుంటే దానిపై సంతకం చేయండి, తేదీ వ్రాయండి, మీరు ఏ ప్రయోజనం కోసం పాన్ ఉపయోగిస్తున్నారో కూడా వ్రాయండి. మూడవ అంశమేంటంటే.. మీకు పాన్ ఉంటే ఆదాయపు పన్ను పోర్టల్‌(Income Tax department Portal)లో ఖచ్చితంగా ఖాతాను తెరవండి. దీనివల్ల వచ్చే నష్టమేమీ లేదు. భవిష్యత్తులో ప్రయోజనాలే ఉంటాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook