Share Market: స్టాక్ మార్కెట్ అంటేనే ఓ వింత ప్రపంచం. షేర్ మార్కెట్‌లో లిస్టింగ్ రోజే ఏకంగా 13 వేల శాతం రిటర్న్స్ ఇచ్చిన షేర్ ఎప్పుడైనా చూశారా..ఆ వివరాలు మీ కోసం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్‌లో లిస్టింగ్ తరువాత పెట్టుబడిదారులకు లాభాలు కలగడం చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. కానీ లిస్టింగ్ అయిన రోజే ఇన్వెస్టర్లకు ఏకంగా 13 వేల శాతం రిటర్న్ లభించడం ఎక్కడా ఎప్పుడూ చూసుండరు. కానీ ఇవాళ మేం మీకు అలాంటి ఓ కంపెనీ స్టాక్స్ గురించి వివరించనున్నాం. లిస్టింగ్ రోజే ఆ కంపెనీ షేరు ఇన్వెస్టర్లకు 13 వేల 31 శాతం రిటర్న్ ఇచ్చింది. అంతే ఒక్కరోజులోనే ధనవంతులైపోయారు..


ఇదొక చైనా కంపెనీ. ఈ కంపెనీ షేర్లు ఒకేసారి పెరగడం ఇన్వెస్టర్లకు ఆశ్చర్యానికి గురి చేసింది. బుధవారం అంటే ఆగస్టు 31న Addentax Group Corp అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ అయింది. అదే రోజు 13 వేల శాతం రిటర్న్ వచ్చింది. Addentax స్టాక్స్‌లో వేగం కారణంగా మార్కెట్‌లో ట్రేడింగ్ చాలాసార్లు ఆపాల్సి వచ్చింది. ఈ వేగం కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పుడు 20 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 


కంపెనీ వ్యాపారమేంటి


Addentax అనేది గార్మెంట్స్ తయారీ కంపెనీ. దాంతోపాటు లాజిస్టిక్ వ్యాపారం కూడా చేస్తుంది. Addentax స్టాక్స్‌లో ఒక్కసారిగా వచ్చిన వృద్ధి కారణంగా కంపెనీ ఛైర్మన్, సీఈవో హోంగ్ జిడా, అతని సోదరుడు హోంగ్ ఝివాంగ్ సంపద భారీగా పెరిగిందని తెలుస్తోంది. వీరి సంపద 1.3 బిలియన్ డాలర్లుగా మారింది. కంపెనీలో ఒకరికి 4.8 శాతం వాటా ఉంటే..మరొకరికి 1.6 శాతం వాటా ఉంది. 


ఈ ఏడాది ఇన్వెస్టర్లకు భారీ లాభాల్ని ఇచ్చిన 8వ చైనా కంపెనీ ఇది. ఇంతకుముందు హాంగ్ కాంగ్‌లోని రెండు కంపెనీలు AMTD Digital, Magic Empire ఇలానే ఇన్వెస్టర్లకు భారీ లాభాల్ని అందించాయి. 


Also read: Multibagger Stocks: నాలుగేళ్ల వ్యవధిలో లక్ష రూపాయల్ని 8 లక్షలు చేసిన షేర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook