CIBIL Score Impacts On Your Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ ... ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా వినపడుతున్న పదం ఇది. ఒక వ్యక్తికి ఏదైనా అత్యవసరం వచ్చి.. వారి వద్ద సేవింగ్స్ డబ్బులు లేని పక్షంలో వారిని ఆదుకునేది ఈ పర్సనల్ లోన్సే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవసరం చిన్నదైనా.. పెద్దదయినా.. లేదంటే ఇంట్లో ఏదైనా వస్తు సామాగ్రి కొనుగోలు చేయడం కోసమైనా.. ఆర్థిక అవసరం ఏదయినా.. వారి వారి అర్హతలకు అనుగుణంగా బ్యాంకులు పర్సనల్ లోన్స్ మంజూరు చేస్తుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవ్వరూ ఎలాంటీ గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఏ ఆస్తిని మార్ట్‌గేజ్ చేయకుండా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. పర్సనల్ లోన్‌కి కావాల్సిందల్లా మీరు ప్రతీ నెలా ఎంత సంపాదిస్తున్నారు.. అందులోంచి ఇతర ఇఎంఐలు, ఖర్చులు పోంగా మీకు ఎంత మిగులుతోంది అనే లెక్కలేసుకుని మీకు ఎంత లోన్ మంజూరు చేయవచ్చు అనేది బ్యాంకులు నిర్ధారిస్తాయి. ఐతే, అన్నింటికంటే ముందుగా.. బ్యాంకులు మొట్టమొదటిగా చెక్ చేసేది మాత్రం మీ సిబిల్ స్కోర్ నే. ఔను, పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సిబిల్ స్కోర్ ని బ్యాంకులు చెక్ చేస్తాయి. ఆర్థికంగా మీకు ఎంత శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని ఒక్క ముక్కలో చెప్పేదే ఈ సిబిల్ స్కోర్. 


పర్సనల్ లోన్‌కి మాత్రమే కాదు.. మీరు ఎలాంటి లోన్ కోసం అప్లై చేసినా.. మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి ? మీ ఆర్థిక స్థోమత ఎంత అనే ఆర్థిక పరమైన విషయాలు తెలుసుకునేందుకు బ్యాంకులు మీ సిబిల్ స్కోర్‌ని చెక్ చేస్తాయి.


సిబిల్ స్కోర్ కనిష్టంగా 300 నుండి గరిష్టంగా 900 వరకు ఉంటుంది. బ్యాంకింగ్ నార్మ్స్ ప్రకారం కనీసం 750 సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే .. బ్యాంకులు మీకు రుణాలు మంజూరు చేసేందుకు ముందుకు వస్తాయి. అంతకంటే తక్కువగా స్కోర్ ఉంటే.. మీ ఆదాయాన్నిబట్టి బ్యాంకులు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బ్యాంకుల మధ్య పోటీపూరితమైన వాతావరణం పెరిగిన నేపథ్యంలో కొన్ని బ్యాంకులు కస్టమర్ సిబిల్ స్కోర్ ఉండాల్సిన దాని కంటే కొంత తక్కువే ఉన్నప్పటికీ.. వారి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా పర్సనల్ లోన్స్ మంజూరు చేస్తున్నాయి. 


సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. లోన్స్ వడ్డీ రేట్లపై సిబిల్ స్కోర్ ప్రభావం ఉంటుందా అని. సిబిల్ స్కోర్‌ని బట్టి బ్యాంకులు వడ్డీ రేటు నిర్ణయిస్తాయా అనేది కొంతమందికి కలిగే సందేహం. ఔను.. ఇది నిజమే. మీ సిబిల్ స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే.. మీరు తీసుకునే రుణంపై వడ్డీ రేటు మీకు అంత తక్కువగా లభించే అవకాశం ఉంటుంది. తక్కువగా అంటే మరీ 3 శాతమో లేక 4 శాతమో అని కాదు కానీ.. ఇండస్ట్రీలో ది బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ మీకు వర్తిస్తుంది అని అర్థం. 


ఇది కూడా చదవండి : Maruti Suzuki Cars August Sales: దుమ్మురేపిన మారుతి సుజుకి.. కార్ల అమ్మకాల్లో దూకుడు


ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే.. మీ ప్రొఫైల్ రిస్క్ ప్రొఫైల్ అని బ్యాంకులు భావిస్తాయి. అందుకే ఉండాల్సిన దాని కంటే ఇంకొంత ఎక్కువ మొత్తంలో వడ్డీ రేటు విధిస్తాయి. ఎందుకంటే.. మీరు చెల్లించే ఇఎంఐలో అసలు కంటే వడ్డీనే ఎక్కువగా కలిపి వసూలు చేస్తుంటారు. అలాంటప్పుడు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటేనే కదా బ్యాంకులకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడంతో పాటు మీకు రుణం ఇచ్చినందుకు లాభం దక్కుతుంది.


ఇది కూడా చదవండి : 2023 Royal Enfield Bullet 350 Prices And Specs: ఇండియాలో లాంచ్ అయిన మరో సరికొత్త బుల్లెట్ బైక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి