Stock Market Update: స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు రోజుల నష్టాలకు (Stocks closing bell) బ్రేక్ పడింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (BSE Sensex) రికార్డు స్థాయిలో 767 పాయింట్లు బలపడి 60,686 వద్ద స్థిరపడింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ (NSE Nify) 229 పాయింట్లు పెరిగి 18,102 వద్ద స్థిరపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు అన్ని రంగాలు తెరుకున్నాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. 


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 60,750.72 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 59,997 కనష్ఠానికి పడిపోయింది.


నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,123 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,905 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. చివరి దశలో కాస్త తేరుకుంది.


Also read: Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ


Also read: Rakesh Jhunjhunwala: ఆకాశ ఎయిర్​ నుంచి బోయింగ్​కు రూ.75 వేల కోట్ల ఆర్డర్​?


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


టెక్ మహీంద్రా (Tech Mahindra Shar price) 4 శాతం, హెచ్​డీఎఫ్​సీ 2.99 శాతం, ఇన్ఫోసిస్​ 2.74 శాతం, బజాజ్ ఫిన్​సర్వ్​ 2.22 శాతం, భారతీ ఎయిర్​టెల్ (Airtel Share) 2.02 శాతం లాభాలను గడించాయి.


బజాజ్ ఆటో 3.04 శాతం, టాటా స్టీల్ (Tata Steel Share price)​ 0.93 శాతం, యాక్సిస్​ బ్యాంక్ 0.36 శాతం, ఎన్​టీపీసీ 0.29 శాతం, పవర్​ గ్రిడ్​ 0.11 శాతం నష్టాలన  నమోదు చేశాయి.


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 25 కంపెనీలు లాభాలను గడించాయి. 5 కంపెనీలు మాత్రమే స్వల్పంగా నష్టపోయాయి.


Also read: Viral Video: RRR 'నాటు నాటు' పాటకు బామ్మ డ్యాన్స్.. ఎనర్జీకి ఫిదా అవుటున్న నెటిజన్లు


Also read: Jacqueline Fernandez Gallery: లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బికినీ ఫొటోషూట్ వైరల్..


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా) టోక్యో (జపాన్​), హాంకాంగ్, సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​ సూచీలు లాభాలతో ముగిశాయి.


కాస్త పెరిగిన రూపాయి..


డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 07 పైసలు తగ్గింది. ప్రస్తుతం మారకం విలువ 74.43 వద్ద కొనసాగుతోంది.


Also read: Venkatesh Drishyam 2: వెంకటేష్ ‘దృశ్యం 2’ టీజర్ రిలీజ్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్


Also read: Bengaluru Express: రైలుపై విరిగిపడిన కొండచరియలు...పట్టాలు తప్పిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook