Akasa Air: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(Big bull Rakesh JhunJhun wala).. నేతృత్వంలోని 'ఆకాశ' ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి మరో కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ.. విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.75,000 కోట్లు) విలువైన ఆర్డరు ఇవ్వనున్నట్లు (Akasa Boeing deal) సమాచారం.
70-80 737 మ్యాక్స్ విమానాల కోసం ఈ ఆర్ఢరు ఇచ్చినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. బోయింగ్ ఒప్పందం గురించి 'ఆకాశ' సంస్థ దుబాయ్ ఎయిర్‌షోలో (Dubai airShow) ప్రకటించే అవకాశముందనేది ఈ కథనం సారాశం.
ఈ విషయాలపై రాకేశ్ జున్జున్ వాలా నుంచి గానీ, ఆకాశ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.
అయితే ఆ వార్తా సంస్థ కథనంలో మాత్రం.. వచ్చే ఏడాది తొలినాళ్లలో కనీసం 10 విమానాలను డెలివరీ చేసేలా ఈ ఒప్పందం కుదిరినట్లు ఉంది. ఆకశ విమానాలు 2022 వేసవిలో కార్యకలాపాలు ప్రారంభించే వీలుందని.. అందుకే అందుకు కావాల్సిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని ఆ వార్తా కథనం పేర్కొంది.
Also read: Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ
Also read: Surat: చరిత్ర సృష్టించిన పోక్సో కోర్టు ..చిన్నారి హత్యాచార కేసులో 5 రోజుల్లోనే తీర్పు..
ఆకాశ ఎయిర్ గురించి..
కరోనాతో దెబ్బతిన్న వ్యాపారాల్లో విమానయాన రంగం కూడా ప్రధానమైంది. దీనితో ఇప్పటికే ఉన్న చాలా సంస్థలు ఉద్యోగులను తగ్గించుకోవడం, నిర్వహణ ఖర్చులకు కోత విధించడం వంటి చర్యలు తీసుకున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు.
బడ్జెట్ ధరలో విమానయాన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్థలను నెలకొల్పారు. దీనికి 'ఆకాశ ఎయిర్‌లైన్స్' అని పెట్టారు.
Also read: PNB reduces interest rates: పీఎన్బీ ఖాతాదారులకు షాక్- సేవింగ్స్ ఖాతాల వడ్డీకి కోత
Also read: Equity Mutual Funds: ఈక్విటీ మార్కెట్లో పురోగతి, భారీగా పెట్టుబడులు
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఎమన్నారంటే..
ఈ కొత్త ఎయిర్‌లైన్ ఏర్పాటు చేసిన నాలుగేళ్లలోపే 70 విమానాలను కలిగి ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు గతంలో చెప్పారు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.
రానున్న రోజుల్లో విమాన ప్రయాణాలు పెరగనున్నాయని.. అయినా తమ సంస్థ అత్యంత తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పించనుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఈ సంస్థలో 40 శాతం వాటా రాకేశ్ ఝున్‌ఝున్ వాలా చేతిలోనే ఉంటుందని సమాచారం.
ఇందులో భాగంగానే ఆకాశ ఎయిర్ గతనెలలో సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు పొందింది. దీనితో ఇక విమానాలను కొనుగోలు చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.
Also read: smoking inside flight: విమానంలో సిగరెట్ తాగిన ఆంధ్ర వ్యక్తి- చైన్నై ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్
Also read: Kangana Ranaut Freedom 2014: కంగనా రనౌత్ ఓ బిచ్చగత్తె.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook