PNG CNG Price Reduce More than 5 Ruppes: గ్యాస్ ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఫార్ములాకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కంపెనీలు గ్యాస్ ధరలు తగ్గించడం ప్రారంభించాయి. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఏటీజీఎల్‌) గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సీఎన్‌జీ గ్యాస్‌పై ప్రతి కిలోకు రూ.8.13, పీఎన్‌జీ గ్యాస్‌పై రూ.5.06 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. తగ్గించిన ధరలు ఏప్రిల్ 8 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. దీంతో గ్యాస్‌ వినియోగదారులకు భారీ ఊరట కలిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సహజ వాయువు ధరలపై కొత్త ధరల విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ప్రకటించిన ఒక రోజులోనే గ్యాస్‌ ధరల మార్పు జరిగింది. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ శుక్రవారం 19 ప్రాంతాలలో పీఎన్‌జీ, సీఎన్‌జీ గ్యాస్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థికవేత్త కిరిత్ పారిఖ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలు పది శాతం తగ్గనున్నాయి. 


తాజా తగ్గింపుతో పెట్రోల్ కంటే 49 శాతం, డీజిల్ కంటే 16 శాతం చౌకగా సీఎన్‌జీ తక్కువ ధరకు లభించనుంది. అదేవిధంగా దేశీయ పీఎన్‌జీ ఎల్‌పీజీ కంటే 21 శాతం చౌకగా మారింది. మంత్రి మండలి సమావేశంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరలపై APM గ్యాస్‌పై ఒక MMBTUకి కనిష్ట ధర 4 డాలర్ల బేస్ ధరగా.. దీంతో పాటు MMBTU గరిష్ట ధరను 6.5 డాలర్లుగా నిర్ణయించారు. ఏప్రిల్ నెలలో దేశీయంగా ఉత్పత్తి చేసిన గ్యాస్ ధర ఏప్రిల్‌లో USD 6.5/mmBtu, ఇతరులకు USD 7.92గా ప్రకటించింది.


Also Read: Girl Swallows Mobile Phone: తమ్ముడితో గొడవ.. సెల్‌ఫోన్ మింగేసిన యువతి


మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అనురాగ్ వెల్లడిస్తూ.. కొత్త ఫార్ములా ప్రకారం సీఎన్‌జీ-పీఎన్‌జీ గ్యాస్ ధరలు ముడి చమురుతో అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. దేశీయ గ్యాస్ ధర ఇప్పుడు భారత క్రూడ్ బాస్కెట్.. ప్రపంచ ధర నెలవారీ సగటులో 10 శాతం ఉంటుందన్నారు. సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలను ప్రతి నెల వెల్లడిస్తామన్నారు. ఈ ఫార్ములా పీఎన్‌జీ ధరలను 10 శాతం వరకు తగ్గిస్తుందని అన్నారు. సీఎన్‌జీ ధరలు 7 నుంచి 9 శాతం వరకు తగ్గుతాయన్నారు. ధరల తగ్గింపుతో సాధారణ గృహ వినియోగదారుల నుంచి వాహనాలు నడిపే వ్యక్తుల వరకు ఊరట కలగనుంది.


Also Read: Covid-19 Cases In India: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రెండు రోజులు మాక్‌డ్రిల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి