Credit Debit Card Rules: క్రెడిట్, డెబిట్ కార్డు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఖాతా నుంచి దొంగిలించిన డబ్బును తిరిగి పొందవచ్చు!
Credit Debit Card Rules: క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగదారులకు శుభవార్త! ఇకపై మీ ఖాతా నుంచి ఎవరైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేసినా.. ఆ డబ్బును తిరిగి పొందొచ్చు. మీరు వినియోగించే బ్యాంకుల బీమా నుంచి ఆ డబ్బును రికవరీ చేసుకోవచ్చు. అందుకు సంబంధిచిన ప్రకటనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ సర్క్యులర్ ద్వారా తెలియజేసింది.
Credit Debit Card Rules: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ లో అనేక కొత్త మార్పులను ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్ కార్డుల విభాగానికి సంబంధించిన అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకు, నాన్ - బ్యాంకు సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డులను జారీ చేయడంపై ఆర్బీఐ ఓ మాస్టర్ సర్క్యులర్ ను విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాస్టర్ సర్క్యులర్ అంటే ఏమిటి?
వడ్డీ రేట్లు, ఫీజుల వంటి ముఖ్యమైన విషయాలను కేవలం ఒకే ఒక పేజీలో కస్టమర్లకు తెలియజేసేందుకు బ్యాంకులు ఈ మాస్టర్ సర్క్యులర్ ను తీసుకొచ్చారు. దీని ద్వారా కస్టమర్లు ఏదైనా కార్డు గురించి అప్లే చేసుకుంటే.. ఒకవేళ ఆ అభ్యర్ధనను తిరస్కరిస్తే దాని గురించి కస్టమర్ కు తప్పక తెలియజేయాలి. అదే విధంగా క్రెడిట్, డెబిట్ కార్డుల నిబంధనలు మారినప్పుడు కస్టమర్లకు తప్పక సమాచారాన్ని తెలపాలి.
క్రెడిట్, డెబిట్ కార్డుల జారీకి కొత్త నిబంధనలు..
1) ఒకవేళ కార్డు వినియోగదారులు మోసపోతే.. వారు బ్యాంకుల బీమా రక్షణ నుంచి తిరిగి ఆ డబ్బును పొందవచ్చని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది.
2) కస్టమర్ల అనుమతి లేకుండా ఏదైనా బ్యాంకు డెబిట్ కార్డును జారీ చేస్తే.. వసూలు చేసిన దానికి రెండింతలు తిరిగి కస్టమర్ కు చెల్లించాల్సి ఉంటుంది.
3) అదే విధంగా కస్టమర్ అనుమతి లేకుండా జారీ చేసిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డు దుర్వినియోగమైతే.. ఆ నష్టాన్ని సదరు బ్యాంకులు చెల్లించాలి.
4) క్రెడిట్ లేదా డెబిట్ కార్డు యాక్టివేట్ చేయడానికి కస్టమర్ నుంచి తప్పనిసరిగా OTP ఆమోదం పొందాలి.
5) దీంతో పాటు కస్టమర్లకు కార్డు విడుదల చేసిన 30 రోజుల కంటే ఎక్కువగా ఉపయోగించకపోతే.. ఆ తర్వాత ఏడు రోజుల్లో ఎలాంటి నగదు తీసుకోకుండా క్రెడిట్ కార్డు ఖాతాను రద్దు చేయడం జరుగుతుంది.
Also Read: Truecaller Call Recording: Truecaller వినియోగదారులకు గమనిక.. ఇకపై యాప్ లో ఆ ఫీచర్ పనిచేయదు!
Also Read: Flipkart Samsung F22: రూ.549 ధరకే శాంసంగ్ ఎఫ్ 22 కొనేయండిలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.