త్వరలో పన్ను పరిధిలోకి `క్రిప్టో` ఆదాయం- బడ్జెట్లో చట్ట సవరణ!
Cryptocurrency: క్రిప్టో కరెన్సీల ద్వారా గడించే ఆదాయం పన్ను పరిధిలోకి రానుందా? అంటే అవుననే సమధానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు కీలక వివరాలు తెలిపారు.
Government to bring cryptocurrencies under the tax net: క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తుచేస్తున్నట్లు సమాచారం. 2022-23 బడ్జెట్ బిల్లులో ఈ అంశాన్ని (Cryptocurrencies bill in Budget) కూడా చేర్చే అవకాశలున్నాయని ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు.
ఆదాయపు పన్ను పరంగా ఇప్పటికే కొంత మంది.. క్రిప్టో కరెన్సీలో మూలధనంపై పన్నులు చెల్లిస్తున్నట్లు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ (Tarun Bajaj on Cryptocurrency) తెలిపతారు. దీనికి జీఎస్టీ వర్తిస్తుందని చట్టాలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు.
'ప్రస్తుతం క్రిప్టో కరెన్సీవినియోగం పెరిగిపోయింది. చట్టాల్లో మార్పులు (Changes in Income tax rules) తీసుకురాగలమా అనేది చూడాలి. ఇది బడ్జెట్లో భాగమే. ప్రస్తుతం మనం బడ్జెట్‌కు దగ్గర ఉన్నాం. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటాం.' అని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు.
Also read: వావ్: గూగుల్ పేలో కొత్త ఫీచర్.. వాయిస్ కమాండ్‌తో మనీ ట్రాన్స్ ఫర్
Also read: ఆ క్రెడిట్ కార్డులను బ్యాన్ చేస్తోన్న అమెజాన్
ఏమిటి ఈ క్రిప్టో కరెన్సీ..
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేక సాఫ్ట్వేర్ కోడ్ల ద్వారా పని (What is Cryptocurrency) చేస్తుంటాయి. మనం సాధారణంగా చూసే కరెన్సీలను భౌతికంగా చూడగలం, ముట్టుకోగలం. అయితే క్రిప్టో కరెన్సీని సాఫ్ట్‌వేర్‌తో రూపొందించి కరెన్సీ. కాబట్టి వీటిని భౌతికంగా చూడలేం, ముట్టుకోలేం.
పేరుకు తగ్గట్లుగానే.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్ చైన్ సాంకేతికతలు క్రిప్టోకరెన్సీకి మూలాధారాలు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తున్నందున క్రిప్టో కరెన్సీల లావాదేవీలను సురక్షితంగా జరుగుతంటాయి.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. వీటిపై ఏ దేశానికి నియంత్రణ లేదు. అందుకే.. వీటి వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతుంటాయి.
ప్రస్తుతం మార్కెట్లో.. బిట్‌కాయిన్ (Bitcoin), ఇథేరియం, స్టెల్లార్, రిపుల్, డాష్ కాయిన్లు బాగా పాపులర్.
Also read: డెబిట్, క్రెడిట్ కార్డులపై ఉండే సివివి అర్థం ఏంటి ? సివివితో హ్యాకర్స్ మోసం చేయలేరా ?
గతంలో బ్యాన్ కానీ..
నియంత్రణ లేదనే కారణంతో క్రిప్టో కరెన్సీల వినియోగంపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గతంలో నిషేధం (RBI Ban Cryptocurrency) విధించింది. అయితే దీనికి వ్యతిరేకంగా ఓ సామాజిక కార్యకర్త వేటిసి పిటిషన్‌పై విచారణ జరిపిన సూప్రీం కోర్టు.. 2020 మార్చులో ఆర్బీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. దీనితో దేశంలో క్రిప్టో కరెన్సీ వినియోగం మళ్లి అధికారికమైంది.
క్రిప్టో కరెన్సీ వ్యాపారం ఇప్పుడు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. వివిధ యాప్‌లు బిట్‌కాయిన్ ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పలు దిగ్గజ సంస్థలు బిట్‌కాయిన్ ద్వారా లావాదేవీలకు అనుమతినిస్తున్నాయి.
Also read: బంగారం కొంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
Also read: డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో అగ్రస్థానం- అప్‌లోడ్‌లో వొడాఫోన్ ఐడియా జోరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook