Elon Musk Effect: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంటే మామూలు విషయం కానేకాదు. క్రిప్టోకరెన్సీ విషయంలో ఎలాన్ మస్క్ అంటే ఏంటో తెలిసింది. అందుకే ఎలాన్ మస్క్‌కు క్రిప్టోకరెన్సీ మదుపుదారులు చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. అదేంటో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెస్లా(Tesla), స్పేస్‌ఎక్స్ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మరోసారి తన ప్రభావాన్ని చూపించారు. క్రిప్టోకరెన్సీపై ఎలాన్ మస్క్ ప్రభావం ఇంకా ఆగలేదు. అది కొనసాగుతూనే ఉంది. ఎలాన్ మస్క్ పాత్ర క్రిప్టోకరెన్సీపై చాలానే ఉంటుంది. బహుశా అందుకే క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లు ఎలాన్ మస్క్‌ను ముద్దుగా డాగీ ఫాదర్ అని పిల్చుకుంటారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేస్తూ ఫ్లోకీ వచ్చేసిందంటూ ట్వీట్ చేశారు. అంతే..ఆ ఒక్క ఫోటో షేర్ ఎఫెక్ట్ క్రిప్టోకరెన్సీ విలువ అమాంతంగా పెరిగిపోయింది. కేవలం డాగ్ కాయిన్(Dog Coin) మాత్రమే కాకుండా బేబీ డాగ్ వంటి ఆల్ట్ నాణేలు కూడా గణనీయంగా పెరిగాయి. ఎలాన్ మస్క్ తన పెంపుడు జంతువు ఫోటో షేరింగ్‌కు..క్రిప్టోకరెన్సీ విలువ పెరగడానికి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా. కచ్చితంగా ఉంది. క్రిప్టోకరెన్సీ సింబల్‌ను షిబాఇను బ్రీడ్ కుక్కతోనే చూపిస్తారు. అందుకే ఎలాన్ మస్క్ ఆ ఫోటో షేర్ చేయగానే..విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. డాగ్ కాయిన్ క్రిప్టోకరెన్సీనే కాకుండా మరికొన్ని ఇతర క్రిప్టోకరెన్సీలను కూడా ఇదే బ్రీడ్‌తో చూపిస్తారు. షిబా ఫ్లోకీ థీమ్‌తో ఉన్న క్రిప్టోకరెన్సీ విలువ దాదాపు 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 958.09 శాతం మేర పెరిగిపోయింది. అటు ఇంకో క్రిప్టోకరెన్సీ(CryptoCurrency) ఫ్లోకిఇను కూడా 24 గంటల వ్యవధిలో 59.08 శాతం పెరిగింది. అటు ఫ్లోకి శిబా క్రిప్టోకరెన్సీ 23.46 శాతం పెరిగింది. బేబీ డాగ్ కాయిన్ విలువ 1.80 శాతం జంప్ అయింది. డాగ్ కాయిన్ గడిచిన 24 గంటల్లో 0.36 శాతం మేర మార్పును నమోదు చేసింది.


Also read: Jio Book Laptop: జియో నుంచి మరో సంచలనం..! త్వరలో మార్కెట్లోకి జియోబుక్ ల్యాప్‌టాప్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook