UPI Cashback Offer: ఈ బ్యాంకుతో యూపీఐ లావాదేవీలు జరిపితే 7500 రూపాయలు క్యాష్‌బ్యాక్
UPI Cashback Offer: ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే కన్పిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు వినిమయం పెరగడంతో యూపీఐల వాడకం ఎక్కువైంది. అందుకే చాలా యూపీఐలు అందుబాటులో వస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.
UPI Cashback Offer: ప్రస్తుతం పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీలే కాకుండా దాదాపు అన్ని బ్యాంకులు యూపీఐలు ఆపరేట్ చేస్తున్నాయి. దేశంలో యూపీఐలకు ఉన్న క్రేజ్ అలాంటిది. రానున్న కాలంలో ఇది మరింత పెరగవచ్చని అంచనా. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు యూపీఐలు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
చాలా యూపీఐలు చాలా రకాల ఆఫర్లు ప్రకటించినా ఓ ప్రైవేట్ బ్యాంక్ ఆఫర్ ముందు అన్నీ దిగదుడుపే అన్పిస్తున్నాయి. డీసీబీ బ్యాంకు హ్యాపీ సేవింగ్ ఎక్కౌంట్ ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పుడీ బ్యాంకు యూపీఐ లావాదేవీలపై ఏడాదికి ఏకంగా 7,500 రూపాయల వరకూ క్యాష్‌బ్యాక్ ఇచ్చే ఏర్పాటు చేస్తోంది. అదెలాగో పరిశీలిద్దాం. డీసీబీ బ్యాంక్ హ్యాపీ సేవింగ్ ఎక్కౌంట్ క్యాష్‌బ్యాక్ పొందాలంటే కనీసం 500 రూపాయల యూపీఐ లావాదేవీలు జరిపాలి. ఒక త్రైమాసికంలో చేసే లావాదేవీల్ని బట్టి క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. త్రైమాసికం చివర్లో మీ ఎక్కౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి.
ఈ ఎక్కౌంట్ ద్వారా ఏడాదికి 7,500 రూపాయల వరకూ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ నగదు నెల చొప్పున విభజించి నెలకు 625 రూపాయలు చెల్లిస్తుంది బ్యాంకు. డీసీబీ హ్యాపీ సేవింగ్ ఎక్కౌంట్‌లో కనీస త్రైమాసిక బ్యాలెన్స్ 10 వేలుండాలి. క్యాష్‌బ్యాక్ రివార్డ్స్ పొందాలంటే 25 వేలు కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ షరతులు వర్తిస్తే మాత్రం ఏడాదిగకి యూపీఐ లావాదేవీలపై 7500 రూపాయలు పొందవచ్చు.
డీసీబీ బ్యాంక్ కస్టమర్లు అందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. పాత కస్టమర్లు తమ సేవింగ్ ఎక్కౌంట్‌ను హ్యాపీ సేవింగ్ ఎక్కౌంట్‌లో మార్చుకోవల్సి ఉంటుంది. ఈ ఎక్కౌంట్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ ఫ్రీ ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ సేవలు పొందవచ్చు. అంతేకాకుండా డీసీబీ ఏటీఎం నుంచి ఎన్ని సార్లు అయినా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
Also read: Vande Metro Trains: త్వరలో వందే మెట్రో రైళ్లు ప్రారంభం, ఈ రైళ్ల ప్రత్యేకతలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook