Dell Working Days: వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే.. ఉద్యోగులకు `డెల్` హెచ్చరిక
Dell Remote System: ఇంటి నుంచి పని విధానంతో ఇన్నాళ్లు హాయిగా విధులు నిర్వహించుకున్న ఉద్యోగులకు కంపెనీలు షాక్‌లు ఇస్తున్నాయి. ఇక చాలు కార్యాలయానికి వచ్చేయండి పిలుపునిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా డెల్ కంపెనీ కూడా అదే నిర్ణయ తీసుకుంది. అయితే మూడు రోజుల విధానం అమలుచేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.
Dell Work From Home Option: ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా వైరస్ జాడ ప్రస్తుతం కనిపించడం లేదు. ఒకవేళ మళ్లీ దాడి చేస్తే వ్యాక్సిన్‌లు ఉండడంతో ప్రపంచం ధీమాతో జీవిస్తున్నది. ఈ నేపథ్యంలో అప్పుడు అమలుచేసిన పని విధానాన్ని కార్పొరేట్ సంస్థలు సడలించుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి అరికట్టుట కోసం.. ఒకేచోట గుమికూడి ఉండద్దనే ఉద్దేశంతో అప్పట్లో 'ఇంటి నుంచి పని' విధానం అమలుచేశారు. దాదాపుగా మూడు, నాలుగేళ్లుగా కొన్ని సంస్థల్లో ఇంటి నుంచి పని విధానం కొనసాగుతోంది. తాజాగా ఆ విధానం ఎత్తివేయాలని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు కార్యాలయాలకు రావాలని ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తున్నాయి. ఇంటి పనికి అలవాటు పడ్డ ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి మొండికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు రిమోట్ పద్ధతిలో 'మూడు రోజులు' కార్యాలయానికి రావాలని చెబుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత డెల్ కూడా అదే పద్ధతిని అవలంభించింది.
Also Read: Cockroach Vande Bharat: భోజనంలో బొద్దింక.. 'వందే భారత్' ప్రయాణికుడికి విస్తుగొల్పే ఘటన
ఇంటి నుంచి పని విధానంలో పాక్షిక మార్పులు చేసి మూడు రోజులు కార్యాలయంలో విధులు నిర్వర్తించాలని డెల్ కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి కార్యాలయానికి వచ్చి పనిచేయాలంటే ఇబ్బందులు ఉంటాయనే కోణంలో ఆలోచించి మూడు రోజులు కార్యాలయానికి రావాలని ఆదేశించింది. అయితే కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించడానికి అంగీకరించని ఉద్యోగులకు మాత్రం తీవ్ర హెచ్చరిక చేసింది. మూడు రోజులు కూడా కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించకుంటే ఉద్యోగం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సుతిమెత్తంగా హెచ్చరించింది. ఈ సందర్భంగా ఉద్యోగుల ఇంటరాక్షన్, ఇన్నోవేషన్, క్రియేటివిటీని డెల్ కంపెనీ గుర్తు చేసి వాటి ప్రాముఖ్యాన్ని వివరించింది.
Also Read: Fish Load Lorry: రోడ్డుపై విలవిలలాడిన చేపలు.. జాలి లేకుండా వాటిపైనే వెళ్లిన వాహనాలు
ప్రస్తుతం డెల్ సంస్థలో 60 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో 2023 మార్చిలో డెల్ కార్యాలయానికి గంట లోపల చేరుకునే ఉద్యోగులకు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయంలో విధులు నిర్వహించాలని ఆదేశించింది. తాజాగా ఇక దూరంతో సంబంధం లేకుండా.. ఎక్కడ నివసిస్తున్నా కూడా ఉద్యోగులంతా విధిగా మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందేనని తాజాగా నిర్ణయించింది. రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. కాగా ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు, అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా రావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులకు మాత్రం సడలింపులు ఇచ్చింది. అలాంటి ఉద్యోగులు పూర్తి సమయం రిమోట్ విధానంలో విధులు నిర్వహించవచ్చని పేర్కొంది.
కోతలు కూడా..
ప్రపంచంలోనే డెల్ ప్రఖ్యాత సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి. అయితే కరోనా తర్వాత ఎదురైన తీవ్ర ఒడిదుడుకులతో డెల్ కూడా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. ఇతర సంస్థల మాదిరిగా పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. గతేడాది 2023లో 5 శాతం మందిని తొలగించింది. అంటే 6 వేల కంటే ఎక్కువ మందిని డెల్ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ సంవత్సరం కూడా లేఆఫ్స్ ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఉద్యోగులు విధిగా కార్యాలయానికి వచ్చి పని చేస్తున్నారు. ఎందుకంటే ఇంటి నుంచి పని చేసే వారినే పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వ్యవహార శైలిలో మార్పు వస్తోంది. కాగా రానురాను మూడు రోజులు ఎత్తివేసి పూర్తిగా కార్యాలయంలోనే పని విధానం అమలు చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook