బంగారం (Gold) అనగానే ముందుగా గుర్తొచ్చేంది భారతీయులే. భారతీయ స్త్రీ జీవన శైలిలో బంగారం ఒక భాగంగా మారిపోయింది. కరోనా కాలంలో (Corona) కూడా మనదేశంలో పసిడి ధరలు (Gold Rate) ఆకాశాన్ని తాకాయంటే గోల్డ్ పై మగువకు ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇటీవల కాలంలో బంగారాన్ని అలంకరణ ప్రాయంగానే కాకుండా పెట్టుబడి మార్గంగా కూడా మార్చుకంటున్నారు. గత దశాబ్ధ కాలంగా బంగారం ధరలు ప్రతీ ఏడాది కనీషం 20 శాతం పెరుగుతూ వస్తున్నాయి. దీంతో మధ్య తరగతి వర్గాల వారికి బంగారం ప్రధాన పెట్టుబడి మార్గంగా కనిపిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిజిటల్ బంగారం ఎలా కొనాలి?
అయితే, ఇటీవల కరోనా మాహమ్మారి (Corona Crisis) వలన వ్యాపారాలు చెల్లాచెదురయ్యాయి. దీంతో, ఆన్లైన్ విక్రయాలు (Online market) ఊపందుకున్నాయి. పసిడి వ్యాపారలు కూడా ఇదే బాటలో పయనించారు. అక్కడే, డిజిటల్ బంగారం (Digital Gold) వ్యాపారానికి భీజం పడింది. బంగారాన్ని భౌతికంగా కాకుండా డిజిటల్ గా కొనుగోలు చేయవచ్చు. ఆగ్మొంట్‌ గోల్డ్‌ లిమిటెడ్‌ (Augmont Gold Limited), ఎంఎంటీసీ-పీఎఎంపీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (MTC-PAMP India Pvt Ltd), డిజిటల్‌ గోల్డ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు (Digital gold india private limited) డిజిటల్ బంగారాన్ని అందిస్తున్నాయి. ఫోన్ పే (Phone pay), గూగల్ పే (Google Pay), పేటీఎం (Paytm) వంటి మొబైల్ యాప్ ల ద్వారా డిజిటల్ బంగారం కొనుగోలు చేయొచ్చు. 


Also Read: Dale Steyn: ఆటకు గుడ్ బై చెప్పిన స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్...అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన


డిజిటల్ బంగారం కొనుగోలు వలన ప్రయోజనాలు ఏంటీ?
బంగారం ధరలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో వస్తువు రూపంలో కొనాలంటే కనీసం 10వేలైన అవసరం అవుతుంది. కానీ, ఒక్క రూపాయి ఉన్నా.. డిజిటల్ బంగారం కొనొచ్చు. భౌతిక బంగారం క్వాలిటీలో చాలా రకాలు ఉంటాయి. ధరలు ఒకేలా ఉండవు. కానీ, డిజిటల్ బంగారానికి ఇలాంటి సమస్యలు లేవు. డిమాండ్ బట్టి విలువ మారుతుంది. దీనిని స్యూరిటీగా పెట్టి బ్యాంక్ లో లోన్లు కూడా పొందొచ్చు. స్థానిక పరిణామాలు బంగారం ధరలను నియంత్రించే అవకాశం ఉంటుంది. కానీ, వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్ (International gold market) తో అనుసంధానమై ఉంటాయి. కావాలి అనుకున్నప్పుడు వీటిని అమ్మటమే కాకుండా వస్తువు రూపంలో కూడా దీన్ని పొందొచ్చు. ఇలాంటి ప్రయోజనాల కారణంగా ఇటీవల డిజిటల్ బంగారం కొనుగోలుకు ఎక్కువ మంది ఆశక్తి చూపిస్తున్నారు. 


డిజిటల్ గోల్డ్ పై సెబీ నిబంధనలు 
వినియోగదారులు డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయడానికి ఫిన్‌టెక్‌తో (Fintech) పాటు స్టాక్‌ బ్రోకింగ్‌ (Strong Broking) సంస్థలు అందుబాటులో ఉండేవి. కానీ, సెబీ నిబంధలన ప్రకారం సెప్టెంబరు 10 నుంచి అది సాధ్యం కాదు. సెక్యూరిటీస్‌ కాంట్రాక్ట్స్‌ నిబంధనలు, 1957 ప్రకారం.. డిజిటల్‌ గోల్డ్‌ను ఓ సెక్యూరిటీగా గుర్తించలేమని, దీన్ని నియంత్రించడం తమ పరిధిలోకి తేల్చి చెప్పింది. తమ ఆధీనంలో ఉన్న సంస్థలు మాత్రం డిజిటల్ విక్రయాలు నిలిపివేయాల స్సష్టం చేసింది. అయితే, ఇప్పటికే పలు బ్రోకింగ్‌ సంస్థల ద్వారా డిజిటల్‌ గోల్డ్‌ (Digital Gold) కొనుగోలు చేసినవారు అవే సంస్థల ద్వారా విక్రయించడం కానీ,  లోహరూపంలో బంగారాన్ని మార్చుకోవడం కానీ చేయాలని తెలపింది. ఇకపై మదుపర్లు నేరుగా డిజిటల్‌ గోల్డ్‌ విక్రయిస్తున్న సంస్థలతోనే సంబంధాలు కొనసాగించాలని తెలపింది.


Also Read: Suspicious Fever: యూపీని వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook