బంగారం కొంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
Digital Gold vs Physical Gold: మారిన కాలంలో అన్ని అంశాల్లో భారీ మార్పులు వచ్చాయి. అలానే బంగారంపై పెట్టుబడుల విషయంలో అనేక కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మరి అవి ఏమిటి? సంప్రదాయకరమైన పసిడి కొనుగోలు పద్ధతులకన్నా అవి ఎలా బెటర్? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
Best ways to Buy Gold: బంగారం.. అత్యంత విలువైన లోహాల్లో ఒకటి. భారతీయ కుటుంబాల్లో పసిడికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇది మన సంప్రదాయాల్లో భాగమైపోయింది. అందుకే ప్రతి ఇంటా ఎంతో కొంత బంగారం ఉంటుంది.
ఇదిలా ఉంటే.. కరోనా వంటి గడ్డు పరిస్థితుల్లోనూ బంగారం మంచి రిటర్నులు ఇచ్చింది. అందుకే పసిడిని ఉత్తమ, సురక్షితమైన (risk in gold investment) పెట్టుబడిగా భావిస్తుంటారు.
బంగారంపై పెట్టుబడుల్లో భారీ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు భౌతికంగా, కాయిన్ల రూపంలో మాత్రమే కొనుగోలు చేసే వీలుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. డిజిటల్ రూపంలో కూడా బంగారం కొనేందుకు (Ways to Buy Gold) వీలుంది. డిజిటల్ రూపంలో పసిడిపై పెట్టుబడి అత్యంత సులువైన ప్రక్రియే కాదు.. అంతే సేఫ్ కూడా అంటున్నారు వ్యక్తిగత ఆర్థిక నిపుణులు.
భౌతికంగా బంగారం కొనుగోలులో సమస్యలు..
భౌతికంగా బంగారం కొనుగులో చేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా.. కొనుగోలు చేసిన పసిడిని దాయటం అనేది సవాలుతో కూడుకున్న విషయం. ఎక్కువ బంగారం ఉంటే.. దొంగల భయం ఉంటుంది. పోనీ లాకర్లలో దాచుకుందాం అంటే.. అందుకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సమస్యలను దాటుకుని బంగారం దాచుకున్నప్పటికీ.. దానిని అమ్మే సమయంలో మరిన్ని చిక్కులు ఎదురవుతాయి. ముఖ్యంగా తరుగు సమస్య ఉంటుంది. దీనితో పాటు విక్రయించేందుకు దాని ధరను కొన్నిసార్లు.. కొనేవారు నిర్ణయిస్తుంటారు. ఈ సమస్యలన్నింటిని తప్పించేంచేదుకు డిజిటల్ రూపంలో పసిడిపై పెట్టుబడి ఉత్తమమైన మార్గమని (Why Digital gold is safe) విశ్లేషకులు చెబుతున్నారు.
అందుకే నగలు కావాలనుకుంటే తప్పా.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారాన్ని భౌతికంగా కొనొద్దు అని సలహా ఇస్తున్నారు.
Also read: వరుసగా రెండవరోజు పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధర
Also raad: యమహా నుంచి మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ధర ఎంతో తెలుసా ?
డిజిటల్ రూపంలో గోల్డ్‌పై పెట్టుబడులతో ఉపయోగాలు..
డిజిటల్ రూపంలో గోల్డ్‌పై పెట్టుబడితో స్టోరేజీ సమస్య ఉండదు. నాణ్యత తగ్గేందుకు అవకాశమే లేదు. కొనుగోలు చేసిన వెబ్సైట్లో ఎప్పటికప్పుడు.. ఎంత బంగారం ఉంది? దాని విలువ ఎంత? అనేది తెలుసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఒక్క క్లిక్‌తో విక్రయించే వీలుంది.
అయితే డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలుతో మరో ప్రయోజనమేమిటంటే.. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కొంచెం, కొంచంగా కొనుగోలు చేయొచ్చు. అలా నిర్ణీత మొత్తాన్ని జమ చేసి.. ఒకే సారి డెలివరీ తీసుకోవచ్చు. భౌతికంగా ఇలా సాధ్యపడదు.
Also read: 2021-22 క్యూ4లో ఎల్ఐసీ ఐపీఓ- వివిధ పీఎస్‌యూల ప్రైవేటీకరణ కూడా!
డిజిటల్ రూపంలో గోల్డ్ కొనడం ఎలా?
డిజిటల్ పద్ధతుల్లో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు.. అనేక మార్గాలు ఉన్నాయి.
ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ , సేఫ్ గోల్డ్ వంటి కంపెనీలు డిజిటల్ గోల్డ్‌ను విక్రయిస్తుంటాయి. వీటితో పాటు పేటీఎం, గూగుల్‌పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లలో కూడా గోల్డ్‌ను కొనొచ్చు. గోల్డ్ కొనుగోలు విషయంలో ఈ సంస్థలు పూర్తిగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు లోబడి కార్యకలాపాల సాగిస్తాయి. కాబట్టి వీటిని వినియోగించడం సురక్షితమేనని వ్యక్తగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
డీమ్యాట్ ఖాతా ఉంటే.. గోల్డ్ ఈటీఎఫ్‌లను కూడా కొనుగోలు చేయొచ్చు. అలా కాకుండా.. ప్రభుత్వం జారీ చేసే సార్వ భౌమ పసిడి బాండ్లను కూడా కొనొచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు అంటే?
ఈటీఎఫ్ అంటే ఎక్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్(What is Gold ETF). అదే బంగారం ఆధారంగా ఉంటే అది గోల్డ్ ఈటీఎఫ్. కంపెనీ షేర్లలానే ఇవి ఎక్స్ఛేంజీల్లో ట్రేడవుతాయి. ట్రేడింగ్ సమయంలో వీటిని కొనడం, అమ్మడం చేయాల్సి ఉంటుంది.
Also read: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా బడ్జెట్ ఎయిర్‌లైన్ 'ఆకాశ' రెండు భారీ డీల్స్!
పసిడి బాండ్లు..
భారత ప్రభుత్వం తరఫున వీటిని ఆర్బీఐ జారీ చేస్తుంది. వీటిని కొనేందుకు డీ మ్యాట్, ఆన్లైన్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలను వినియోగించుకోవచ్చు.
సార్వభౌమ పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారు వార్షికంగా 2.5 శాతం వడ్డీ రేటుతో స్థిరమైన రాబడిని పొందవచ్చు. ఈ వడ్డీని ఆరు నెలలకు ఒకసారి పెట్టుబడిదారుల ఖాతాలో జమ చేస్తారు. చివరి ఆరు నెలల వడ్డీని మొత్తం పెట్టుబడితో కలిపి చెల్లిస్తారు.
ఈ బాండ్లను ప్రతి నెల ఇష్యూ చేస్తుంటుంది ఆర్బీఐ. ఇందులో కనీసం ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కిలోల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
Also read: లిస్టింగ్ రోజే నిరాశ- పేటీఎం షేర్లు భారీ పతనం!
Also read: డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో అగ్రస్థానం- అప్‌లోడ్‌లో వొడాఫోన్ ఐడియా జోరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook