లిస్టింగ్ రోజే నిరాశ- పేటీఎం షేర్లు భారీ పతనం!

Paytm's shares plunged: ప్రముఖ ఫిన్​టెక్​ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్​ లిమిటెడ్ మార్కెట్లో లిస్టింగ్ రోజే నష్టాలను నమోదు చేసింది. ఒక్క షేరుపై ఇప్పటి వరకు రూ.480కిపైగా నష్టం వాటిళ్లింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 01:03 PM IST
  • లిస్టింగ్​ రోజే కుప్పకూలిన పీటీఎం షేర్లు
  • ఆరంభంలోనే 9 శాతం డౌన్​
  • కంపెనీ ఎం-క్యాప్ రూ.లక్ష కోట్ల పైమాటే
లిస్టింగ్ రోజే నిరాశ- పేటీఎం షేర్లు భారీ పతనం!

Shares of Paytm plummeted 22 pc in their market debut: దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్​ లిమిటెడ్) షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నేడు (గురువారం) లిస్టింగ్​కు (Patm Shares Listing day) వచ్చాయి. అయితే ఐపీఓలో అదరగొట్టిన పేటీఎం (Paytm IPO).. లిస్టింగ్​లో మాత్రం మదుపరులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఆరంభంలోనే డీలా..

ఇష్యూ ధరతో పోలిస్తే.. షేరు విలువ 9.3 శాతం తక్కువ వద్ద లిస్టయింది. ఐపీఓ సమయంలో పేటీఎం షేరు ధరను రూ.2,150గా నిర్ణయించగా.. బీఎస్​ఈలో 9 శాతం దిగువన (Paytm Share price) రూ.1,955 వద్ద లిస్టయింది. అటు ఎన్​ఎస్​ఈలోనూ 9.30 శాతం దిగువన రూ.1,950 వద్ద లిస్టింగ్​కు వచ్చింది. ఒకానొక దశలో పేటీఎం షేరు విలువ (Paytm Share prce in BSE) రూ.1,586 వద్దకు పడిపోయింది.

బీఎస్​ఈలో ప్రస్తుతం 22.37 శాతం నష్టంతో (మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో) షేర్లు ట్రేడవుతున్నాయి. షేరు విలువ రూ.1,671 వద్ద ఉంది. పెట్టుబడితో పోలిస్తే.. ఇప్పటి వరకు ఒక్కో షేరుపై (Paytm First day lose) రూ.482.75 నష్టం నమోదైంది. బీఎస్​ఈ ప్రకారం పేటీఎం మార్కెట్ క్యాపిటల్ (Paytm M-Cap)​ రూ.1,08,083 కోట్లుగా తెలుస్తోంది.

ఎన్​ఎస్​ఈలో (Paytm Share price in NSE) షేరు విలువ 14.46 శాతం నష్టంతో రూ.1,668 వద్ద ఉంది.

Also read: 2021-22 క్యూ4లో ఎల్​ఐసీ ఐపీఓ- వివిధ పీఎస్​యూల ప్రైవేటీకరణ కూడా!

Also read: వరుసగా రెండవరోజు పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధర

ఐపీఓ భళా..

రూ.18,300 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది పేటీఎం. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.10 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. రూ.8,300 కోట్ల విలువైన షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకోసం ఐపీఓ ద్వారా అందుబాటులో ఉంచారు.

ఈ నెల 8న ప్రారంభమైన ఐపీఓ 10న ముగిసింది. ఇందులో ఒక్కో షేరు ధరను రూ.2,080-2,150 మధ్య నిర్ణయించింది కంపెనీ. ఐపీఓతోనే ఆసియాలో అతిపెద్ద ఫిన్​టెక్ కంపెనీగా (Biggest Fintech Company in Asia) పేటీఎం చరిత్ర సృష్టించింది. ఐపీఓలో షేర్లు 1.89 శాతం ఓవర్​ సబ్​స్క్రైబ్​ అయినట్లు తేలింది.

Also read: డౌన్​లోడ్​ స్పీడ్​లో జియో అగ్రస్థానం- అప్లోడ్​లో వొడాఫోన్ ఐడియా జోరు!

Also read: రాకేశ్ ఝున్​ఝున్​వాలా బడ్జెట్ ఎయిర్​లైన్​ 'ఆకాశ' రెండు భారీ డీల్స్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News