Diwali Car Discounts 2023: దీపావళి సీజన్‌లో కార్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఏ కార్లపై తక్కువ ఆఫర్లు ఉన్నాయని వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు మారుతీ సుజుకి బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. గత నెలలో దాదాపు 2 లక్షల కార్లలను విక్రయించిన మారుతి సుజుకి.. ఈ నెలలో కూడా అదేస్థాయిలో అమ్మకాలు కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది. వివిధ కార్ల మోడల్‌పై భారీ తగ్గింపుతో అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో కె10 కొనుగోలుపై మొత్తం రూ.49,000 ఆదా అవుతుంది. బ్రాండ్ రూ.15,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌తో పాటు రూ.30 వేల వరకు క్యాష్‌ బెనిఫిట్ పొందొచ్చు. ఎంపిక చేసిన ట్రిమ్‌లపై రూ.4 వేల కార్పొరేట్ బోనస్ కూడా అందుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతి సుజుకి ఆల్టో కె10 కొనుగోలుపై మొత్తం రూ.54 వేలు ఆదా చేసుకోవచ్చు. బ్రాండ్ రూ.15,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌తో పాటు రూ.30 వేల వరకు క్యాష్‌ బెనిఫిట్ లభిస్తుంది. అదేవిధంగా ఎంపిక చేసిన ట్రిమ్‌లపై రూ.4 వేల కార్పొరేట్ బోనస్ కూడా పొందవచ్చు. టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ రూ.20 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 25 వేల వరకు ముందస్తు నగదు తగ్గింపుతో విక్రయిస్తోంది. ఇంకా కొనుగోలుపై రూ.4 వేల కార్పొరేట్ బోనస్ వర్తిస్తుంది. WagonR ను 1.0L పెట్రోల్ ఇంజన్ లేదా 1.2L పెట్రోల్ మోటారుతో కొనుగోలు చేయవచ్చు. ఇది ఫ్యాక్టరీకి అమర్చిన సీఎన్‌జీ ట్రిమ్‌తో కూడా అందుబాటులో ఉంది.


సెలెరియో మోడల్‌పై రూ.20 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతోతో పాటు రూ.35 వేల నగదు తగ్గింపు, రూ.4 వేల కార్పొరేట్ ప్రయోజనం లభిస్తుంది. అయితే AMT వేరియంట్‌లకు క్యాష్ తగ్గింపు ఉండదు. సెలెరియో CNG ట్రిమ్‌లలో కూడా అందుబాటులో ఉంది. 25.24 kmpl మైలేజీని ఇస్తుంది. రూ.10 లక్షలలోపు బడ్జెట్‌లో అయితే.. మారుతి సుజుకి స్విఫ్ట్ రూ.25 వేల నగదు తగ్గింపుతో పాటు రూ.20 వేల ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌తో సహా రూ.49 వేల వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన ట్రిమ్‌లపై రూ.4 వేల కార్పొరేట్ తగ్గింపు కూడా లభిస్తుంది. 


డిజైర్ కారు, ప్రస్తుతం రూ.10 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. బ్రాండ్ డిజైర్‌పై ఎలాంటి ఆఫర్లు అందించడం లేదు. ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా పెట్రోల్ ట్రిమ్‌లకు మాత్రమే అందిస్తోంది. ఇక మారుతి సుజుకి ఇగ్నిస్‌పై రూ.70 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ డీల్‌లో రూ.35 వేల క్యాష్ బెనిఫిట్ ఉంటుంది. అదనంగా రూ.25 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.10 వేల కార్పొరేట్ బెనిఫిట్ లభిస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రిమ్‌లకు వర్తిస్తుంది.


మారుతి సుజుకి బాలెనో కారు రూ.25 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.20 వేల వరకు ముందస్తు నగదు ప్రయోజనంతో లభిస్తోంది. అంతేకాకుండా కొనుగోలుపై కార్పొరేట్ తగ్గింపు వర్తిస్తుంది. బాలెనో ప్రస్తుతం 5-స్పీడ్ MT, 5 స్పీడ్ AMT-2 ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో 1.2L పెట్రోల్ మోటారుతో అందుబాటులో ఉంది. బ్రాండ్ C-సెగ్మెంట్ సెడాన్-మారుతి సుజుకి సియాజ్‌పై రూ.38 వేల వరకు బెనిఫిట్ అందుతుంది. ఇందులో రూ.10 వేల నగదు ప్రయోజనం, రూ.25 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.3 వేల కార్పొరేట్ బోనస్ అందుతుంది. సియాజ్ 1.5L NA పెట్రోల్ మోటారుతో అమ్మకానికి ఉంది. 


జిమ్నీ కారు మొత్తం రూ.లక్ష తగ్గింపుతో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇది రూ.50 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.50 వేల ముందస్తు క్యాష్ బెనిఫిట్ అందిస్తోంది. కార్‌మేకర్ బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, ఎక్స్‌ఎల్6, ఎర్టిగా కార్లపై ఎలాంటి ఆఫర్లు లేవు. అయితే కంపెనీ రూ.5 వేల వరకు ఎంపిక చేసిన మోడల్‌లపై అదనపు స్క్రాప్‌రేజ్ బోనస్‌ను అందిస్తోంది.


Also Read: World Cup 2023 Semifinal Teams: పాక్ వర్సెస్ ఆఫ్ఘన్ వర్సెస్ కివీస్ 4వ సెమీస్ ఎవరిది


Also Read: NBK109: గొడ్డలికి కళ్ళజోడు.. మన బాలయ్య కు మరో బ్లాక్ బస్టర్ షురూ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి