Paytm: పేటీఎం చేయకండి.. వ్యాపారులకు CAIT కీలక సూచన..!
Paytm payments bank: జనవరి 31న Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఈనేపథ్యంలో సీఏఐటీ పేటీఎం ద్వారా చెల్లింపులు చేసే వ్యాపారులకు కీలక ప్రకటన చేసింది.
Paytm payments bank: జనవరి 31న Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌లు, వాలెట్‌లు, కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ మొదలైన వాటిలో డిపాజిట్‌లను స్వీకరించడం నిషేధించింది. RBI ప్రకారం 2024 ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంకింగ్ సేవ ఏ కస్టమర్‌కు అందుబాటులో ఉండదు. అయితే ఆర్బీఐ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనేది తెలుసుకుందాం.
ఈనేపథ్యంలో పేటీఎం వినియోగిస్తున్న వ్యాపారులకు ట్రేడర్స్ సమాఖ్య కీలక సూచన చేసింది. నగదు లావాదేవీలకు పేటీఎం బదులు ఇతర నగదు చెల్లింపుల యాప్‌లను వినియోగించుకోవాలని సూచించింది. అంతేకాదు, ముందుస్తు జాగ్రత్తగా బ్యాంకులు నేరుగా నిర్వహించే పేమెంట్ యాప్ ను వినియోగించుకోవాలని వ్యాపారులకు చెప్పింది.
ఇదీ చదవండి: Paytm Payments Bank: ఒక పాన్‌కార్డ్‌పై 1000 ఖాతాలు... ఈ కారణాల వల్ల Paytm పై RBI ప్రత్యక్ష చర్య..
ఈ సందర్భంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) Paytm బదులుగా ఇతర అప్లికేషన్‌లను ఉపయోగించాలని సూచించింది.పేటీఎం ఖాతాలో ఉన్న నగదును రికవరీ చేసేందుకు, నష్టం లేకుండా లావాదేవీలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా పేటీఎంను ఉపయోగిస్తున్న వ్యాపారులకు ఆల్ ఇండియా మర్చంట్స్ ఫెడరేషన్ హెచ్చరికలు జారీ చేసింది.
రాయిటర్స్ ప్రకారం RBI Paytm పై ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో ఒక పాన్ కార్డ్‌తో వెయ్యి మందికి పైగా వినియోగదారులు ఖాతాలు తెరిచారు. అదనంగా, ఆర్‌బిఐ ,ఆడిటర్‌ల పరిశోధనలు పేటిఎమ్ బ్యాంక్ నిబంధనలను పాటించడం లేదని తేలింది.
Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం వెనుక మరో ప్రధాన కారణం ఎటువంటి ధృవీకరణ లేకుండా ఖాతాలు సృష్టించబడటం. ఈ ఖాతా KYC ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. అలాగే ఈ ఖాతా నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు కూడా జరిగాయి.
ఇదీ చదవండి: Investment Plan: మీ జీతం రూ.20 వేలా? మీరు కోటీశ్వరులవ్వచ్చు.. ఎలానో తెలుసా?
ఫిబ్రవరి 29 తర్వాత కూడా Paytmలో ఖాతాలు ఉన్న వినియోగదారులు తమ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్ లేదా మరేదైనా ఖాతాలో డబ్బు ఉంటే కస్టమర్లు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook