Offline UPI Payments: హుర్రే... ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్స్.. ఎలాగో చూడండి!
ఇంటర్నెట్ లేకుండా కూడా UPI లావాదేవీలు జరపవచ్చని మీకు తెలుసా..? అవును ఇది నిజమే.. ఆన్‌లైన్ మాత్రమే కాదు *99# USSD ద్వారా ఆఫ్‌లైన్ ద్వారా కూడా సులభంగా UPI చెల్లింపులు చేయవచ్చు. ఎలానో తెలుసుకుందామా ?
Offline UPI payments: సాధారణంగా ఆన్‌లైన్ చెల్లింపుల్లో చాలా సార్లు సమస్యను ఎదుర్కొంటూ ఉంటాము. ఇంటర్నెట్ నెమ్మదిగా లేదా అసలే లేకపోవటం వంటి కారణాల వలన డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యల నుండి విముక్తి పొందే మరో మార్గం కూడా ఉంది అదే ఆఫ్‌లైన్ UPI మోడ్ లావాదేవీలు.
ఇంటర్నెట్ లేని సమయాల్లో లేదా నెట్‌వర్క్ అందుబాటులో లేని సమయాల్లో కూడా ఆఫ్‌లైన్ UPI మోడ్ ను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ చాలాకాలం నుండి అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది వాడటం లేదు. ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు సమయంలో మాత్రమే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నారు.
Also Read: Viral: మధ్యప్రదేశ్ లో దారుణం...వానలు కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు..
ఇంటర్నెట్ వల్ల మీ డబ్బులు మధ్యలో ఆగిపోవటం లేదా ఇతరుల అకౌంట్ లో జమ కాకపోవటం వలన మళ్లీ తిరిగి రావటానికి కనీసం 7 నుండి 15 రోజుల సమయం పడుతుంది. అదే ఆఫ్‌లైన్ మోడ్ పేమెంట్ ద్వారా నేరుగా ఖాతా దారుల అకౌంట్ లోకి డబ్బు క్షణాల్లో చేరుతుంది. కాకపొతే నగదు బదిలీ చేసే వ్యక్తి మరియు నగదు పొందే వ్యక్తి మొబైల్ నంబర్ వారి వారి బ్యాంక్ ఖాతాలతో జతపరచపడి ఉండాలి.
ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చెల్లింపులు
*99# USSD ద్వారా ఆఫ్‌లైన్ మోడ్‌లో నగదు బదిలీ జరపవచ్చు. దీనికోసం స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు.. ఏ ఫోన్ ద్వారా అయిన ఈ చెల్లింపులు చేయవచ్చు. కానీ ఈ రకం చెల్లింపులకు మొబైల్ నంబర్లు అకౌంట్ లతో జతపరచబడి ఉండాలన్న విషయం మాత్రం మరచిపోకండి.
Also Read : Corona Third Wave: కరోనాని ఎదుర్కొని పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే మార్గాలు
ఇంటర్నెట్ లేకుండా ఆఫ్‌లైన్ UPI చెల్లింపులు
1. మొదటగా మీ ఫోన్ లో *99# నంబర్ టైప్ చేసి డయల్ చేయండి
2. కొన్ని సెకన్ల తరువాత ఒక మెనూ ఓపెన్ అవుతుంది.
3. మీరు నగదు బడులీ చేయాలి కాబట్టి "1" నంబర్ నొక్కి "సెండ్" బటన్ క్లిక్ చేయండి.
4. తరువాత మీకు మరొక మెనూ కనపడుతుంది.. అందులో ఎలా మరొకరికి నగదు బదిలీ చేయాలని.. ఉదాహరణకు అందులో మొబైల్ నంబర్ నుండి పంపాలని అనుకుంటే "1" ని టైప్ చేసి సెండ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
5. ఎవరికీ అయితే నగదు పంపాలని అనుకుంటున్నారో వారి మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయండి.
6. తరువాత ఎంత మొత్తం పంపాలో అక్కడ టైప్ చేసి, ఏదైన వ్యాఖ్యను రాయండి
7. లావాదేవీని పూర్తి చేయడానికి మీ UPI పిన్‌ని నమోదు చేయండి.
8. UPI పిన్ ఎంటర్ చేసిన తరువాత నేరుగా వేరొక వ్యక్తి బ్యాంకు ఖాతాలో డబ్బు జమవుతుంది.
Also Read : IND vs ENG 4th test: ఇంగ్లండ్ నడ్డి విరిచిన Jasprit Bumrah.. బుమ్రా ఖాతాలో మరో రికార్డ్
ఈ పద్దతి ప్రకారం ఇంటర్నెట్ లేకుండా కూడా సెకన్ల వ్యవధిలో నగదు బదిలీ జరపవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నగదు వ్యక్తి మరియు పొందే వ్యక్తి ఇద్దరు మొబైల్ నంబర్లు బ్యాంక్ ఖాతాతో జోడించబడి ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe