Digital Payments: కరోనా సంక్షోభం కారణం కావచ్చు..మరో ఇతర కారణం కావచ్చు. డిజిటల్ చెల్లింపులు గత కొద్దికాలంగా విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం డిజిటల్ లావాదేవీలు పెరగడంతో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరుగుతున్నాయి. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
ఇండియాలో డిజిటల్ చెల్లింపులకు(Digital Transactions) గత కొద్దికాలంగా ప్రాధాన్యత పెరుగుతోంది. దేశంలో డీ మోనిటైజేషన్ అమలైనప్పటి నుంచే డిజిటల్ లావాదేవీలు ప్రాచుర్యంలో వచ్చినా..కరోనా సంక్షోభం సమయంలో విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలకు సైతం డిజిటల్ లావాదేవీలు చేరడంతో మరింతగా ప్రాచుర్యం పొందింది. చిన్న చిన్న కొనుగోళ్లు సైతం డిజిటల్ లావాదేవీలతో నడుస్తున్నాయి. ఫలితంగా ఆన్లైన్ పేమెంట్లు పెరిగాయి. ఆగస్టు నెలలో అన్ని పేమెంట్ యాప్‌ల నుంచి డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 6.39 ట్రిలియన్ రూపాయల మేర చెల్లింపులు జరిగాయంటే ఏ స్థాయిలో పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వెల్లడించింది. ఆగస్టు నెలలో దాదాపు 3.5 బిలియన్ల లావాదేవీలు యూపీఐ యాప్‌ల ద్వారా జరిగాయి. గత నెలతో పోలిస్తే 9.5 శాతం పెరిగింది.
ఏప్రిల్-మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) కారణంగా కాస్త తగ్గినా..మళ్లీ పుంజుకుంది.యూపీఐ మోడ్‌లో చెల్లింపులు(UPI Payments) జూలై నెలలో 3.24 బిలియన్ లావాదేవీలు జరగగా..ఆగస్టులో మరింతగా పెరిగాయి. ఇండియాలో మొత్తం 50 థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి. అందులో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, అమెజాన్పేలు టాప్‌లో కొనసాగుతున్నాయి.యూపీఐ ఒక్కటే కాకుండా ఐఎంపీఎస్ ద్వారా ఆగస్టు నెలలో 377 మిలియన్ల లావాదేవీలు జరిగాయని..జూలై నెలతో పోలిస్తే 8.5 శాతం పెరిగిందని తెలుస్తోంది. ఐఎంపీఎస్ లావాదేవీల విలువ 3.18 ట్రిలియన్లుగా ఉంది.ఎన్పీసీఐ అభివృద్ధి చేసిన ఫాస్ట్‌ట్యాగ్(FASTag)ద్వారా ఆగస్టు నెలలో 201 మిలియన్ల లావాదేవీలు 3 వేల కోట్ల మేర జరిగాయి. భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ద్వారా 58.88 మిలియన్ల లావాదేవీలు పదివేల కోట్ల మేర జరిగాయి. స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగే కొద్దీ ఆన్లైన్ చెల్లింపులు ముఖ్యంగా యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నాయి. అదే సమయంలో వ్యాపారులు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఆన్లైన్ పేమెంట్లకు(Online payments) దూరంగా ఉండటం గమనార్హం.
Also read: Best Immunity Food: రోగ నిరోధక శక్తిని పెంచే ఐదు ఆహార పదార్ధాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook