Corona Third Wave: కరోనాని ఎదుర్కొని పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే మార్గాలు

కరోనా థర్ట్ వేవ్ ప్రారంభం కాబోతుందని, అది పిల్లలపై అధిక ప్రభావం చుపబోతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఔషదాలను వాడటం ద్వారా వారిలో కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2021, 12:29 PM IST
  • పిల్లలపై అధికంగా ప్రభావం చూపనున్న కరోనా థర్ట్ వేవ్
  • రోగనిరోధక శక్తి పెంచటం ద్వారా పిల్లలను కాపాడుకోవచ్చు
  • ఔషదాల వాడకం ద్వారా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనవచ్చు.
Corona Third Wave: కరోనాని ఎదుర్కొని పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే మార్గాలు

Boost Immunnity in Kids: "థర్ట్ వేవ్" (Third wave) ఈ పదం వింటేనే ప్రపంచం వెన్నులో వణుకు పుడుతుంది. ఇది వరకే కొన్ని దేశాల్లో థర్ట్ వేవ్ ప్రారంభం అవగా కొత్తగా మన దేశంలో పెరుగుతున్న కేసుల దృష్ట్య థర్ట్ వేవ్ వచ్చే సంకేతాలు కనపడుతున్నాయి. కరోనా థర్ట్ వేవ్ (Corona Third Wave) లో పిల్లలపై ప్రభావం చూపందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

పిల్లలలో ఉన్న శరీర రోగ నిరోధక వ్యవ్యస్థ (Immunity power) బలంగా ఉంటే, కరోనా వైరస్ (Corona Virus) ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. నిజానికి మనం ఇచ్చే ఆహార పదార్థాలలో వారికి సరిపోయే పోషకాహారాలు ఉండవు. కావున కింద పేర్కొన్న ఔషదాలను వాళ్లు నే ఆహార పదార్థాల కలపటం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలంగా చేయవచ్చు. 

Also Read: IND vs ENG 4th test: ఇంగ్లండ్‌ నడ్డి విరిచిన Jasprit Bumrah.. బుమ్రా ఖాతాలో మరో రికార్డ్

పసుపు (Turmeric powder)
యాంటీ ఆక్సిడెంట్ (Anti Accident), యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti Inflammatory) గుణాలను కలిగి ఉన్న పసుపు సాధారణంగా మన ఆహార పదార్థాల తయారీలలో వాడతాము. అంతేకాకుండా వ్యాధి నిరోధక లక్షణాలను కలిగి ఉన్నందున, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా, గుండె జబ్బుల నుండి రక్షణ కలిగిస్తుంది. కేన్సర్ (Cancer) కారకాలకు వ్యతిరేఖంగా పని చేయటమే కాకుండా, ఎముకల బలంగా (Strong Bone) మారటానికి, రోగనిరొధక శక్తి పెంచటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. జ్వరం (Fever), దగ్గు(Cough), జలుగు (Cold) వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. రోజు ఒక గ్లాసు పాలలో పసుపు కలిపి పిల్లలకు తాగిస్తే.. వారి రోగనిరొధక శక్తి పెరుగుతుంది. పిల్లల లోనే కాదు ఇలా చేస్తే పెద్ద వారిలో కూడా రోగనిరొధక శక్తి మెరుగుపడుతుంది. 

వెల్లుల్లి (Garlic)
శాస్త్రీయ గుణాలు కలిగిన అద్భుత ఔషదంగా వెల్లుల్లి చెప్పవచ్చు. అల్లంలో ఉంటే అల్లిసిన్ (Allicin) అనే రసాయనిక పదార్థం వైద్య గుణాలను కలిగి ఉన్నందున చెవి నొప్పి, జీర్ణ వ్యవస్థ సమస్యలు కంటి సమస్యలను, గాయాలను తగ్గించటానికి, చర్మ సంబంధిత వ్యాధులు మరియు శ్వాస సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా పిల్లలలో జలుగు  దగ్గు నుండి త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది. పిల్లలలో కనుక జలుబు, దగ్గు వంటి లక్షణాలను కనుగొంటే తాజా వెల్లుల్లి (Fresh Garlic) ముక్కను నమలమని చెప్తే కొద్ది సమయానికే జలుగు, దగ్గు నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న ఆఫీసులో మళ్లీ సోదాలు.. computers, Hard disks, పత్రాలు స్వాధీనం

అల్లం (Ginger)
మంచి ఔషద గుణాలను కలిగి ఉన్న అల్లం పిలలలోనే కాదు పెద్దల్లో కూడా రోగానిధక శక్తిని పెంచుతుంది. యాంటీ బాక్టీరియల్ (Anti Bacterial), యాంటీ ఫంగల్ (Anti Fungal) గుణాలను కలిగి ఉన్న అల్లం ఎస్చెరిచియా కోలి (Escherichia coli), స్టెఫిలోకాకి (staphylococci), స్ట్రెప్టోకోకి (streptococci) మరియు సాల్మోనెల్లా (salmonella) వంటి వాటికి వ్యతిరేఖంగా పని చేస్తుంది. పిల్లల్లో జలుగు దగ్గు వంటి వాటిని తగ్గించటమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

దాల్చిన చెక్క (Cinnamon)
మసాలా గుణాలను కలిగి ఉండే దాల్చిన చెక్క పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి పిల్లలకు తాగించండి. 

Also Read: Vijay Deverakonda: మాట నిలబెట్టుకున్న రౌడీ హీరో..షణ్ముఖ ప్రియకి ఛాన్స్

తులసి (Basil Leaves)
విటమిన్ A, C, K పుష్కలంగా కలిగి ఉన్న తులసి పిల్లలో దగ్గు, జలుబు, జ్వరాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే తులసి ఆకులను పాలలో కలిపి తాగితే.. జ్వరం నుండి త్వరితగతిన ఉపశమనం పొందవచ్చు. 

అశ్వగంధ (Ashwagandha)
ఔషధ మూలికలు కలిగిన అశ్వగంధ రోగనిరోధక వ్యవస్థను పెంచటమే కాకుండా, కండరాలను బలంగా మార్చి, మెదడు పని తీరును వేగవంతం చేస్తుంది. పిల్లలో రోగనిరోధక శక్తి పెంచాలనుకుంటే అశ్వగంధ మంచి ములికగా చెప్పవచ్చు. అలసటతో బాధపడేవారికి ఇదొక మంచి ఔషదంగా చెప్పవచ్చు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News