LPG Cylinder Price: వంటగ్యాస్‌పై భారీ వడ్డింపు.. ఆల్ టైమ్ హై! తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలుసా?
LPG price hiked by Rs 50 per cylinder. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ. 50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో తెలంగాణలో 14 కేజీల వంట గ్యాస్ ధర తొలిసారి వెయ్యి దాటేసి.. రూ.1002కు చేరింది.
Domestic LPG cylinder Price hiked by Rs 50: సామాన్య ప్రజలకు చమురు సంస్థలు వరుస షాకులు ఇస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన చమురు సంస్థలు.. వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెంచాయి. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దాంతో తెలంగాణ రాష్ట్రంలో 14 కేజీల వంట గ్యాస్ ధర తొలిసారి వెయ్యి దాటేసి.. రూ.1002కు చేరింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. చమురు సంస్థలు నిర్ణయంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
2021 అక్టోబర్‌లో రూ.15 పెరిగిన వంట గ్యాస్ ధర.. అప్పటి నుంచి ఐదు నెలల పాటు నిలకడగా ఉంది. దేశవ్యాప్తంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్నప్పటికీ.. అక్టోబర్ ప్రారంభం నుంచి గ్యాస్ ధరలు పెంచలేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో చమురు సంస్థలు సిలిండర్ ధరను పెంచాయి. తాజాగా 14 కేజీల సిలిండర్‌పై ధర రూ.50 పెంచాయి. దాంతో రూ. 949.50లుగా ఉన్న ధర ఒక్కసారిగా వెయ్యి దాటేసింది.
పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 349 కాగా.. 10 కిలోల కాంపోజిట్ బాటిల్ రూ. 669గా ఉంది. ఇక 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2003.50గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,002లుగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,008గా నమోదైంది. దేశరాజధాని ఢిల్లీ, వాణిజ్య నగరం ముంబైలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 949.50కి చేరుకుంది. కోల్‌కతాలో రూ. 976, చెన్నైలో రూ. 965, లక్నోలో రూ. 987కి గ్యాస్ సిలిండర్ ధర చేరుకుంది.
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల పట్ల సామాన్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వంట నూనెల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడం తమని మరింత ఆందోళనకు గురిచేస్తుందని గృహిణులు మండిపడుతున్నారు. గతంలో రూ. 500 లకు వచ్చే వంట గ్యాస్ ఇప్పుడు వెయ్యి దాటిందని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Petrol Diesel Prices: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే?
Also Read: Today Gold and Silver Price: పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో తాజా బంగారం, వెండి రేట్లు ఇవే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook