Edible Oil Prices Reduced to 5%: వంట నూనెల విషయంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందిస్తోంది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో నూనె ధరలు సగటు వినియోగదారుడికి ఉపశమనం కల్గించనున్నాయి. తగ్గిన నూనె ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో వంట నూనె ధరలు సగటు వినియోగదారుడికి పెనుభారంగా మారాయి.  ఓ దశలో 200 దాటేసిన వంట నూనె ధర ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటికీ గతంతో పోలిస్తే వంట నూనె ధర అధికమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు రకాల వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో మరోసారి నూనె ధరలు తగ్గనున్నాయి.


ముఖ్యంగా సోయాబీన్, సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల వంటనూనె మార్కెట్‌లో స్థిరత్వం ఏర్పడి ముడి, శుద్ధి చేసిన నూనె దిగుమతుల మధ్య ఈకో మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఇండియా అవసరాల్లో 60 శాతం వంటనూనె దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. 


Also Read: London Award: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అరుదైన గౌరవం, గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు


నిత్యావసర వస్తు ధరల్ని నియంత్రించేందుకే ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించిందని సాల్వెంట్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. పచ్చి సోయాబీన్, రిఫైండ్ సోయాబీన్ , సన్‌ఫ్లవర్ నూనెల మధ్య సుంకంలో తక్కువ వ్యత్యాసం ఉన్నప్పటికీ రిఫైండ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ దిగుమతి ఆర్ధికపరంగా సాధారణ స్థితికి రాదని అసోసియేషన్ తెలిపింది. 


ఇండియా ప్రతి సంవత్సరం 24 మిలియన్ టన్నుల వంటనూనెలు వినియోగిస్తుంటుంది. ఇందులో 14 మిలియన్ టన్నులు దిగుమతే ఉంటుంది. 2022 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకూ పామాయిల్ దిగుమతి భారీగా పెరిగింది. గత ఏడాది 32 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఈ ఏడాది 59 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇప్పుడు రిఫైండ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం 5 శాతం తగ్గడంతో మార్కెట్‌లో ఈ రెండు వంట నూనె ధరలు తగ్గనున్నాయి. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది. 


Also Read: Amazon Prime Lite: రూ.999కే అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌.. బెనిఫిట్స్ ఇవే..!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook