Amazon Prime Lite @ Rs 999: OTT లవర్సుకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 999కే అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌

Amazon Prime Lite @ Rs 999 Only: వినియోగదారులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లైట్‌ ప్లాన్‌ను అమెజాన్‌  తీసుకొచ్చింది. ఏడాదికి రూ.999తో ఈ సింగిల్ ఫ్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2023, 07:20 PM IST
Amazon Prime Lite @ Rs 999: OTT లవర్సుకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 999కే అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌

Amazon Prime Lite Subscription Price @ Rs 999: అమెజాన్‌ కొత్తగా లైట్‌ ప్లాన్‌ను (Amazon Prime lite) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాదికి దీని ధరను రూ.999గా నిర్ణయించింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ.1499గా ఉంది. పెరిగిన ధర కారణంగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడానికి వినియోగదారులు వెనుకాడతున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ లైట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.  రెగ్యులర్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లో ఉన్న లాభాలే దాదాపు ఇందులో కూడా ఉంటాయి. 

ఒకేసారి రూ. 999 లను చెల్లించి లైట్ ఫ్లాన్ ను పొందవచ్చు. ఇందులో నెలవారీ, త్రైమాసిక ప్లాన్లు వంటివి లేవు. అదే రెగ్యులర్ ప్రైమ్ యొక్క నెలవారీ సభ్యత్వం ధర రూ. 299 మరియు త్రైమాసిక సభ్యత్వం ధర రూ. 599గా ఉన్న సంగతి తెలిసిందే. లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారు అమెజాన్‌లో రెండ్రోజుల డెలివరీ, స్టాండర్డ్‌ డెలివరీలను ఫ్రీగా పొందవచ్చు. అమెజాన్‌ - ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌, బిల్‌ పేమెంట్స్‌ ఇతరత్రాలపై 2 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నారు.

Also Read: UPI Payment: యూపీఐ చెల్లింపుల్లో తస్మాత్ జాగ్రత్త, ఇలా మోసపోయే అవకాశాలు

లైట్ యూజర్లు..ఒకేసారి రెండు డివైజుల్లో హెచ్‌డీ క్వాలిటీలో ప్రైమ్‌ వీడియోను చూడవచ్చు. అంతేకాకుండా వీరు 'డీల్స్‌ ఆఫ్‌ ద డే’'లో కూడా పాల్గొనవచ్చు.  రెగ్యులర్‌ ప్లాన్‌లో ఉన్న వన్‌ డే డెలివరీ, సేమ్‌ డే డెలివరీ ఆప్షన్స్ లైట్ లో ఉండవు. అలాగే ప్రైమ్‌ రీడింగ్‌, ప్రైమ్‌ మ్యూజిక్‌ యాక్సెస్‌ చేయడం కుదరదు. అయితే ఇందులో యాడ్స్ కూడా ఉంటాయి. నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉండదు.

Also Read: London Award: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అరుదైన గౌరవం, గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News