London Award: భారత రిజర్వ్ బ్యాంక్ స్థూలంగా చెప్పాలంటే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గురించి తెలియనివాళ్లు లేరు. విదేశీ గడ్డపై అరుదైన విశిష్టమైన అవార్డును దక్కించుకున్నారు ఇప్పుడు. అదే ప్రతిష్ఠాత్మకమైన గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు. మరెవరికీ దక్కని ప్రతిష్టాత్మక అవార్డు ఇది.
రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఓ ప్రత్యేక అవార్డుతో సత్కరించారు. అది కూడా లండన్‌లో లభించిన గౌరవం. బ్రిటన్ దేశపు ప్రతిష్ఠాత్మక గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును లండన్‌లో సెంట్రల్ బ్యాంకింగ్ అందించింది. ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు, ఆర్ధిక సంస్కరణలు, నిబంధనలు సంబంధిత వ్యవహారాలపై లండన్‌లోని సెంట్రల్ బ్యాంకింగ్ దృష్టి పెట్టడమే కాకుండా ఆయా సంస్థల పనితీరును విశ్లేషిస్తుంటుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు ప్రతిష్టాత్మక గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు ఇవ్వాలని మార్చ్ నెలలోనే నిర్ణయమైంది. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ కీలకమైన మార్పులు, సంస్కరణలను బలోపేతం చేశారని సెంట్రల్ బ్యాంకింగ్ నిర్వాహకులు తెలిపారు. ఇండియాను సంక్లిష్ట స్థితి నుంచి కాపాడేందుకు ప్రయత్నించారని ప్రశంసించింది సెంట్రల్ బ్యాంకింగ్.
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా వినాశనం జరిగింది. జనాభా అత్యధికంగా ఉన్న ఇండియా ప్రత్యేకించి సున్నితమైన పరిస్థితిలో ఉంది. ఇలాంటి సంక్లిష్ట స్థితిలో శక్తికాంత్ దాస్ ప్రభావం గణనీయంగానే ఉంది. అంతేకాకుండా ఆయన హయాంలో ఎదురైన చాలా సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని సెంట్రల్ బ్యాంకింగ్ వివరించింది. ద్రవ్య, ఆర్ధిక వ్యవస్థలకు మూలమైన కేంద్ర బ్యాంకులు తమకిచ్చిన బాధ్యతలకు మించిన పని చేయాలని శక్తికాంత దాస్ తెలిపారు. కేంద్ర బ్యాంకులు ఇటీవలి కాలంలో మూడు ప్రధానమైన ఘటనలు కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ మాంద్యం పరిస్థితుల్ని ఎదుర్కొన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు.
కేంద్ర బ్యాంకులు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న తరువాత వాటి ముందు మరో పెద్ద కష్టం వచ్చిపడింది. అదే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవల్సి వచ్చింది. ఇండియాలో ద్రవ్య విధానంపై గత ఏడాదిగా తీసుకున్న చర్యల ప్రభావం ఇంకా ఇప్పటికీ బహిర్గతం కాలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
Also read; UPI Payment: యూపీఐ చెల్లింపుల్లో తస్మాత్ జాగ్రత్త, ఇలా మోసపోయే అవకాశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook