Honda Activa Electric Scooter: భారత మార్కెట్‌లో ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోదారులు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో  ఓలా, ఏథర్, టీవీఎస్ వంటి కంపెనీలకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.  త్వరలో ఈ కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు ICE వెర్షన్‌లో స్కూటర్ సెగ్మెంట్‌ను శాసిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పోటీ పడబోతున్నాయి. అయితే త్వరలోనే హోండా(Honda ) కూడా ఎలక్ట్రిక్‌ స్కూటీని విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌ వచ్చే ఏడాది జనవరి నెలలో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇది యాజిటీజ్‌ Activaని పోలి ఉంటుంది. అయితే ఈ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివారాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్చి 2024 నాటికి రోడ్లపైకి వచ్చే ఛాన్స్‌ ఉంది. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని హోండా  MD, CEO అట్సుషి ఒగాటా ఇటివలే ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఇది మార్కెట్‌లోకి మంచి బ్యాటరీ ప్యాక్‌అప్‌తో పాటు  ప్రీమియంతో రానుంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌  గరిష్టంగా 50 kmph వేగంతో రోడ్లపై నడవనుంది. ఈ స్కూటీ ICEతో ఉన్న Activaని పోలి ఉంటుందని ప్రకటనలో తెలిపింది కంపెనీ.


మీడియా నివేదికల ప్రకారం.. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ LED హెడ్‌ల్యాంప్, అనలాగ్ ఓడోమీటర్, స్పీడోమీటర్, టాకోమీటర్ వంటి చాలా రకాల ఫీచర్లతో మార్కెట్‌లోకి రానుంది. అయితే వచ్చే సంవత్సరం Activa మోడల్ లైనప్‌తో కూడిన మూడు వేరియంట్‌లలో మార్కెట్‌లోకి రాబోతోంది. అయితే ధరల విషయానికొస్తే రూ.74,536తో ప్రారంభమై రూ.80,537లో అందుబాటులో ఉండనుంది.


ఇతర ఫీచర్లు:
>>లిథియం అయాన్ బ్యాటరీ    
>>60V బ్యాటరీ వోల్టేజ్
>>మొబైల్ యాప్ సపోర్ట్
>>118 కిలోల బరువు    
>>1kW బ్రష్‌లెస్ DC హబ్ మోటార్‌తో కూడిన ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్ (cc)    
>>75 కి.మీ. గరిష్ట వేగం
>>ప్రారంభించండి    విద్యుత్ ప్రారంభం
>>1761 మి.మీ పొడవు
 >>710 మి.మీ వెడల్పు    
>>1170 మి.మీ ఎత్తు    
>>155 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్
>>హైడ్రాలిక్ సస్పెన్షన్
>>ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్
>>LED హెడ్‌ల్యాంప్


Also Read: Planadu Gun Firing: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. టీడీపీ మండలాధ్యక్షుడికి బుల్లెట్ గాయాలు! పరిస్థితి విషమం


Also Read: Hyderabad: హైదరాబాద్​లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.