Hyderabad fire accident: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. బాగ్‌లింగంపల్లి వద్ద గల వీఎస్టీ సమీపంలోని గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. ఫంక్షన్స్ కు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దట్టంగా పొగ అలుముకోవడంతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది కాస్త కష్టపడాల్సి వస్తుంది. పొగ కారణంగా అటువైపు వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఎక్కువ ఉన్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Also Read: Telangana: గ్రూప్ 4 విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఫిబ్రవరి 3 వరకూ గడువు తేదీ పొడిగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook