SUVs With 300km Range: దునియా బదల్ గయా.. ఇప్పుడు జమానా అంతా ఎలక్ట్రిక్ కార్ల వెంట పరుగెడుతున్నారు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు భగ్గుమంటుండటంతో ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసేందుకే ప్లాన్ చేస్తున్నారు. గతంలో అయితే, పెట్రోల్, డీజిల్ కార్లకు సీఎన్జీ చౌక అయిన ప్రత్యామ్నాయంగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో సీఎన్జీ గ్యాస్ ధరలు కూడా పెరుగుతూ పెరుగుతూ పెట్రోల్, డీజిల్ ధరలకు చేరువలోకి రావడం, అందులోనూ సీఎన్జీ వేరియంట్ కారు కోసం కొనేటప్పుడే కనీసం లక్ష రూపాయలు అధికంగా వెచ్చించాల్సి రావడం, అన్నింటికి మించి సీఎన్జీ సిలిండర్ పుణ్యమా అని లగేజీ అవసరాలకు బూట్ స్పేస్ లేకుండా పోవడం వంటి పరిణామాలు కొంతమంది జనాన్ని సీఎన్జీ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు షిప్ట్ అయ్యేలా చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, ప్రస్తుతం ఇండియాలో ఏయే ఎలక్ట్రిక్ SUV కార్లు కనీసం 300 కిమీ పైనే రేంజ్ ఇస్తూ గరిష్టంగా 400 కిమీ నుంచి 630 కిమీ పైనే రేంజ్ ఇచ్చే వాహనాలు ఏమున్నాయి అనేది చెక్ చేద్దాం రండి.


టాటా నెక్సాన్ : 
టాటా నెక్సాన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు రెండు వేరియంట్స్‌లో వస్తున్నాయి. అందులో ఒకటి టాటా నెక్సాన్ ప్రైమ్ అయితే, రెండోది టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్. ఈ ఎలక్ట్రిక్ వాహనాల ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ. 14.49 లక్షలుగా ఉంది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఒక్క చార్జింగ్ చేస్తే.. 453 కిమీ వరకు రేంజ్ ఇవ్వగలదు.


మహింద్రా XUV400 :
మహింద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహనాల ఎక్స్‌షోరూం ఆరంభ వేరియంట్ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 19 లక్షల వరకు ఉన్నాయి. ఈ వాహనాలు ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. 456 కిమీ రేంజ్ ఇస్తాయి.


బైడ్ అట్టో 3 : 
బైడ్ అట్టో 3 ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 521 కిమీ రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌షోరూం ధరలు కనిష్టంగా రూ. 34 లక్షల వద్ధ మొదలవుతాయి.


హ్యాందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు : 
హ్యాందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 452 కిమీ వరకు ట్రావెల్ చేయొచ్చు. హ్యాందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ. 23.84 లక్షల నుంచి మొదలవుతుంది.


ఎంజీ జెడ్ఎస్ ఈవీ
ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాల ఎక్స్‌షోరూం బేసిక్ వేరియంట్ ధరలు రూ. 23.38 లక్షల నుంచి లభిస్తున్నాయి. 50kWh బ్యాటరీ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ చార్జింగ్‌తో 461 కిమీ రేంజ్ ఇస్తుంది.


ఇది కూడా చదవండి : Harley-Davidson x440 Price, Features: హార్లే డేవిడ్‌సన్ నుంచి ఇండియాలో లాంచ్ అయిన మరో కొత్త బైక్


హ్యూందాయ్ ఐయోనిక్ 5 : 
SUV ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధిక ధర కలిగిన వాహనాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌షోరూం ధర రూ. 44.95 లక్షలు. అంటే రూ. 5 వేల తక్కువ నిండా రూ. 45 లక్షల రూపాయలన్నమాట. ధరలో ఎలాగైతే ఎక్కువ రేంజ్ ఉందో.. సింగిల్ చార్జింగ్‌తో ఇచ్చే మైలేజ్ రేంజ్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. 72.6 kWh బ్యాటరీ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు కనీసం 631 కిమీ రేంజ్ ఇస్తుంది.


ఇది కూడా చదవండి : First Jobs of Famous Billionaires: లక్షల కోట్లకు పడగలెత్తిన ఈ వ్యాపారుల మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK