Twitter Merger News: మూడో కంటికి తెలియకుండా విలీనం చేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ కధ ముగిసిందా..?
Twitter Merger News: ఎంతైనా ఎలాన్ మస్క్ తరువాతే ఎవరైనా. సోషల్ మీడియా అందరితో ఆడుకుంటే..మస్క్ మాత్రం సోషల్ మీడియా వేదికనే ఓ ఆటాడుకుంటున్నాడు. చేతికి చిక్కినప్పటి నుంచి ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు. అసలేం జరుగుతోంది..
Twitter Merger: ప్రముఖ సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ అంటే ప్రపంచంలో అందరికీ సుపరిచితం. ఒక్క ట్వీట్ మొత్తం స్వరూపం మార్చేస్తుంటుంది ఒక్కోసారి. అంత శక్తివంతమైన సోషల్ మీడియా వేదికగా ఉన్న ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ ఇష్టమొచ్చినట్టు వాడుకుంటున్నాడు.
అందరి కామెంట్లు, పోస్టింగులను వైరల్ చేసే ట్విట్టర్ వేదిక తానే ఓ వార్తగా మారిపోయింది గత కొన్ని నెలలుగా. టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒక్కోసారి ఒక్కొక నిర్ణయంతో ట్విట్టర్‌ను ఇష్టమొచ్చినట్టుగా నడిపిస్తున్నాడు ఎలాన్ మస్క్. ట్విట్టర్ చేజిక్కించుకున్న తరువాత పెద్దఎత్తున సిబ్బందిని, ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని పీకేసిన ఎలాన్ మస్క్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూపోతున్నారు. ట్విట్టర్ వెరిఫికేషన్ టిక్‌కు ధర నిర్ణయిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం, ఆ తరువాత ఏకంగా ట్విట్టర్ లోగోనే మార్చేసి డాగీని పెట్టడంతో పరిస్థితి పరాకాష్ఠకు చేరింది. దీని ప్రభావంతో ఎలాన్ మస్క్ సంపద కూడా కరిగిపోయింది. దాంతో తిరిగి బ్లూ బర్డ్‌నే లోగోగా ఖాయం చేశారు.
ఇప్పుడు మూటో కంటికి తెలియకుండా ట్విట్టర్ కథ ముగించేశాడు. ట్విట్టర్‌ను మరో కంపెనీలో విలీనం చేసేశారు ఎలాన్ మస్క్. ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్‌లో ట్విట్టర్‌ను కలిపేసినట్టు ఆ సంస్థే వెల్లడించింది. ప్రస్తుతం ట్విట్టర్ సంస్థ స్వతంత్ర కంపెనీగా మనుగడలో లేదంటూ ఓ కేసు నిమిత్తం కోర్టుకు సమర్పించిన సమాచారంలో పేర్కొన్నారు ఎలాన్ మస్క్. ఈ పరిణామాన్ని ధృవీకరించేలా ఎలాన్ మస్క్ X అనే ఒకే అక్షరాన్ని ట్వీట్ చేసి వదిలారు.
ఈ ఎక్స్ నేపధ్యమేంటి..?
ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళిక. ఇదొక ఎవ్రీ థింగ్ యాప్. చైనా వీచాట్ తరహాలో మెసేజింగ్, కాలింగ్, చెల్లింపులు, అన్ని కార్యకలాపాలు ఒకే యాప్‌లో ఉండేలా రూపొందించిన యాప్. ఎలాన్ మస్క్ లక్ష్యమిది. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ తుదిదశలో ఉన్నప్పుడే ఎక్స్ యాప్ ప్రణాళికను ఎలాన్ మస్క్ అప్పట్లో వివరించారు. ఎక్స్ సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకే ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఎక్స్ రూపకల్పనను వేగవంతం చేసేందుకు ట్విట్టర్ ఉపయోగపడుతుంది. ఈ విషయాలన్నీ గత ఏడాది అక్టోబర్‌లోనే ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
అంటే ట్విట్టర్‌ను ట్విట్టర్‌లా నడిపే ఆలోచన ఎలాన్ మస్క్‌కు లేదు. అందుకే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విట్టర్ సహాయంతో ఎక్స్ సంస్థకు ప్రాచుర్యం కల్పించడం ఎలాన్ మస్క్ లక్ష్యం.
Also Read: Future Group: వేల కోట్ల అప్పుల్లో కూరుకున్న ఆ కంపెనీపై ముకేష్, అదానీలకు ఎందుకంత ఆసక్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook