కోట్లాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనేజేషన్(EPFO) ఖాతాలున్నాయి. ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో మరియు కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. కొందరు తమకు పన్ను మినహాయింపు లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు భవిష్యత్తు కోసం కొంత మొత్తం నగదు భద్రపరుచుకునేందుకు అవకాశం కల్పించడంపై హ్యాపీగా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అవసరమైన సమయంలో ఈపీఎఫ్‌వో నగదు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇచ్చారు. కొన్ని సందర్బాలలో మీకు ఇన్సూరెన్స్ సైతం లభించనుంది. అయితే మీకు ఈపీఎఫ్ ఖాతాలో నగదు ఎంత ఉంది, మీ జీతం నుంచి ప్రతినెలా ఎంతమేర జమ అవుందో తెలియాల్సి ఉంటుంది. మీ బేసిక్ శాలరీలో 12 శాతం నగదు జీతం నుంచి కట్ అయితే, అంతే మొత్తంలో మీరు కంపెనీ యాజమాన్యం సైతం నగదును పీ ఈపీఎఫ్(EPFO) ఖాతాకు జమ చేస్తుంది. ఈపీఎఫ్‌వో ఖాతాల్లో నగదు ఎంత మేర ఉంది, కంపెనీ కాంట్రిబ్యూషన్ ప్రతినెలా జరుగుతుందో లేదో మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్దతుల్లో తెలుసుకోవచ్చు.


Also Read: Gold Price Today In Hyderabad: బంగారం కొనుగోలుదారులకు షాక్, భారీగా పెరిగిన బంగారం ధరలు


ఈపీఎఫ్ ఖాతాదారులు మీ ప్రావిడెంట్ ఫండ్ వివరాలను కేవలం ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌(EPFO Website)లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406కు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. వెంటనే మీ మొబైల్‌కు మెస్సేజ్ వస్తుంది. అందులో మీ ఈపీఎఫ్ ఖాతాలో చివరి నెల కాంట్రిబ్యూషన్, మొత్తం జమ అయిన నగదు వివరాలు అందిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు కేవైసీ చేయించుకుంటే ఈ అప్‌డేట్స్ మీకు కావాల్సిన సమయంలో పొందుతారు. 


Also Read: Mothers Day 2021 Wishes: అందమైన కోట్స్‌తో అమ్మకు మదర్స్ డే విషెస్ తెలపండి


ఆ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చిన సదరు ఉద్యోగి యూఏఎన్ నెంబర్, ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు పీఎఫ్ ఖాతాలోని నగదు వివరాలు మెస్సేజ్ రూపంలో అందుతాయి. అయితే పీఎఫ్(Provident Fund) ఖాతాదారులు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో తమ యూఏఎన్ నెంబర్‌కు ఎవరైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్లలో ఏదైనా ఒకదాని వివరాలు అప్‌డేట్ చేసిన వారికి పీఎఫ్ బ్యాలెన్స్‌(PF Balance)తో పాటు చివరగా ఎంత మేర నగదు పీఎఫ్ ఖాతాకు జమ చేసిన వివరాలు అందుతాయి.


Also Read: EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook