EPF Interest Amount: 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, వడ్డీ నగదుపై కీలక నిర్ణయం
EPF Interest Amount 2020-21: 6 కోట్లకు పైగా ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాదాతారులు ఉన్నారు. వీరికి గత ఆర్థిక సంవత్సరం వడ్డీ నగదు త్వరలో ఖాతాలకు జమ కానుంది. 8.5శాతం వడ్డీ నగదు ఖాతాదారులకు చేరుతుందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
EPF Subscribers 8.5 Percent Interest Amount:ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో (EPFO) శుభవార్త అందించింది. 6 కోట్లకు పైగా ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాదాతారులు ఉన్నారు. వీరికి గత ఆర్థిక సంవత్సరం వడ్డీ నగదు త్వరలో ఖాతాలకు జమ కానుంది. జూలై నెలలో ఈపీఎఫ్ ఖాతాలలో 8.5శాతం వడ్డీ నగదు ఖాతాదారులకు చేరుతుందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈపీఎఫ్ ఖాతాదారులు వడ్డీ పొందడంతో పాటు ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందుతారని తెలిసిందే. వీటితో పాటు ఎంప్లాయీస్ లింక్‌డ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అందుకుంటారు. దీర్ఘకాలంలో పొదుపు మొత్తం నగదు ఇందులో జమ అవుతుంది. పెన్షన్ ప్రయోజనాలను సైతం 6 కోట్ల ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో అందిస్తోంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2019-20 వడ్డీ నగదు పొందడానికి 8 నుంచి 10 నెలలు ఖాతాదారులు వేచిచూశారు.
ఈపీఎఫ్‌వో ఖాతాలపై నగదుకు వడ్డీరేట్లపై కొన్ని నెలల కిందట కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి, అధికారులు, ఈపీఎఫ్‌వో అధికారులు చర్చించి గత ఏడాది వడ్డీరేటు 8.5 శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఏడేళ్లలో ఈపీఎఫ్ ఖాతాదారులకు అందిస్తున్న అతి తక్కువ వడ్డీరేటు ఇదే కావడం గమనార్హం. ఈపీఎఫ్‌వో కరోనా కష్టకాలంలో కోవిడ్19 అడ్వాన్స్ నగదును నాన్ రిఫండబుల్‌గా ఈపీఎఫ్ ఖాతాదారులకు అందించి ఆర్థికంగా సహకరిస్తోంది.
Also Read: SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
శ్రీనగర్‌లో మార్చి నెలలో కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖల మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వడ్డీరేట్లు యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. కాగా 2014 ఆర్థిక సంవత్సరం నుంచి ఈపీఎఫ్‌వో 8.5 శాతానికి పైగా రాబడి సాధించింది. మరోవైపు ప్రతి ఏడాది భారీ సంఖ్యలో ఈపీఎఫ్ ఖాతాదారులు చేరుతున్నారు. కనుక వడ్డీరేట్లు పెంచడం కంటే ఈపీఎఫ్ ఖాతాదారుల రిటైర్మెంట్ ఫండ్, ఉద్యోగుల నగదు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook