Free Life Insurance Scheme: ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ. 7 లక్షల బెనిఫిట్
Free Life Insurance Scheme to EPF Subscribers: ఒకవేళ ఏ కారణం వల్లయినా ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగానే చనిపోయినట్టయితే.. వారి ఖాతాలో అప్పటి వరకు జమ అయిన పిఎఫ్ మొత్తంతో పాటు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా కలిపి నామిని ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈపీఎఫ్ ఖాతాలో నామినిగా ఎవరి పేరు అయితే ఉంటుందో.. వారి పేరే ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లోనూ నామినిగా ఉంటుంది.
Free Life Insurance Scheme to EPF Subscribers: ఈపీఎఫ్ ఖాతా అంటే ఎవరికైనా గుర్తుకొచ్చే అంశం ఏంటంటే.. వారి నెలవారి వేతనంలోంచి కొంత మొత్తాన్ని పెన్షన్ కోసం, ఇంకొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టడం అని. కానీ చాలామందికి తెలియని ఆర్థిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ఉచితంగానే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుందనే విషయం చాలామందికి తెలియదు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 కోట్లకు పైగా వేతన జీవులు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఖాతాదారులుగా కొనసాగుతున్నారు. కానీ అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే.. ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ. 7 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని. అవును మీరు చదివింది నిజమే.. ఈపీఎఫ్ ఖాతాదారులకు కూడా ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ( EDLI) ద్వారా ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఖాతాదారులుగా ఉన్న వారు డ్రా చేసిన చివరి వేతనం ఆధారంగా సదరు ఉద్యోగి లైఫ్ కవర్‌ని నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ ఏ కారణం వల్లయినా ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగానే చనిపోయినట్టయితే.. వారి ఖాతాలో అప్పటి వరకు జమ అయిన పిఎఫ్ మొత్తంతో పాటు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా కలిపి నామిని ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈపీఎఫ్ ఖాతాలో నామినిగా ఎవరి పేరు అయితే ఉంటుందో.. వారి పేరే ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లోనూ నామినిగా ఉంటుంది.
ఈపిఎఫ్ ఖాతాదారులకు వర్తించే లైఫ్ ఇన్సూరెన్స్ గరిష్ట పరిమితి రూ. 7 లక్షలు కాగా.. కనిష్ట పరిమితి 2.5 లక్షల రూపాయలుగా ఉంది. ఈపీఎఫ్ ఖాతాదారుల అకాల మృతి కంటే ముందుగా కనీసం ఏడాది పాటు వారు సర్వీసులో ఉండాలనే తప్పనిసరి నిబంధన ఉందనే విషయం మర్చిపోవద్దు. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందించే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ .. ఖాతాదారుల నామిని బ్యాంకు ఖాతాలో జమ అవుకుంది. ఒకవేళ నామిని వివరాలు లేని పక్షంలో మృతి చెందిన ఖాతాదారుల చట్టబద్ధమైన వారసుల ఖాతాలో ఆ మొత్తం జమ అవుతుంది.