EPFO New Rule: ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగికి విధిగా పీఎఫ్ ఎక్కౌంట్ ఉండాలనేది నిబంధన. భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడే నిధి ఇది. ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి కొంతభాగం, యజమాని నుంచి కొంతభాగం పీఎఫ్ ఎక్కౌంట్‌లో జమ అవుతుంది. ఇలా ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఎప్పుడైనా అవసరం వస్తే కొంత డబ్బులు అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈపీఎఫ్ఓ ఇప్పుడు పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునే నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. దాని ప్రకారం పీఎఫ్ ఎక్కౌంట్ ఖాతాదారులు 1 లక్ష రూపాయలు చాలా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా కేవలం 3 రోజుల్లో మీ ఎక్కౌంట్‌లో జమ అవుతాయి. ఏయే సందర్భాల్లో ఈపీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు అడ్వాన్స్ తీసుకోవచ్చో ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఇప్పటివరకైతే వైద్య ఖర్చుల కోసం మాత్రమే పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఇకపై పిల్లల పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలు ఇతరత్రా అవసరాలకు కూడా పీఎఫ్ డబ్బుల్ని కొంత విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఈపీఎఫ్ఓ కొత్తగా ఆటో మోడ్ సెటిల్‌మెంట్ ప్రవేశపెట్టింది. ఇందులో ఉద్యోగులు అత్యవసరమైతే డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు. కొన్ని రకాల అత్యవసరాలు వచ్చినప్పుడు పీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ డబ్బుల్నించి కొంత అడ్వాన్స్ పొందగలరు. ఆటోమోడ్ క్లెయిమ్ అనేది 2020 ఏప్రిల్ నెలలోనే ప్రారంభమైంది. 


ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ పరిమితిని కూడా పెంచింది. ఇంతకుముందు 50 వేలు మాత్రమే అడ్వాన్స్ తీసుకునే అవకాశముండేది. ఇప్పుడు 1 లక్ష వరకూ తీసుకోవచ్చు. ఆటో సెటిల్‌మెంట్ మోడ్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఈ డబ్బులు విత్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం 3-4 రోజుల్లోనే మీరు కోరుకున్న డబ్బులు మీ బ్యాంక్ ఎక్కౌంట్‌లో బదిలీ అయిపోతాయి. కొన్ని డాక్యుమెంట్లు మాత్రం తనిఖీ చేస్తారు. ముఖ్యంగా కేవైసీ, క్లెయిమ్ రిక్వెస్ట్ అర్హత, బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు చెక్ చేస్తారు. ఇచ్చిన సమాచారం నిజమేనని తేలితే వెంటనే క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. 


పీఎఫ్ అడ్వాన్స్ కోసం ఎలా అప్లై చేయాలి


ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేసి యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవాలి. ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకుని క్లెయిమ్ సెక్షన్‌లో వెళ్లాలి. మీ బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు వెరిఫై చేసుకోవాలి. అడ్వాన్స్ డబ్బులు మీ ఎక్కౌంట్‌లో బదిలీ అవుతాయి. మీ బ్యాంక్ ఎక్కౌంట్ కాపీ అప్‌లోడ్ చేయాలి. అడ్వాన్స్ ఎందుకనేది ఎంటర్ చేయాలి.  వైద్యం, చదువుతో పాటు పిల్లల పెళ్లి వంటి ఇతర అవసరాలు కూడా ప్రస్తావించవచ్చు. ఆధార్ కార్డు ఓటీపీ ధృవీకరించుకోవాలి. క్లెయిమ్ ప్రక్రియ పూర్తయితే మీ యజమాని అప్రూవల్‌కు పంపిస్తారు. ఆ ప్రక్రియ పూర్తయితే మీ ఎక్కౌంట్‌లో డబ్బులు వచ్చేస్తాయి.


Also read: Ys Jagan Confident: వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి, టీడీపీ ఎందుకు స్పందించ లేదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook