EPFO Covid 19 Advance Claim Procedure: కరోనా కష్ట కాలంలో ఖాతాదారులకు అండగా నిలిచేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 'కోవిడ్ 19 అడ్వాన్స్' అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా డీఏతో కూడిన మూడు నెలల బేసిక్ వేతనాన్ని పొందవచ్చు. కరోనా మహమ్మారి (Covid 19) అదుపులోకి వచ్చేంతవరకు ఖాతాదారులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు 'కోవిడ్ 19 అడ్వాన్స్‌'ను ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి ఎంప్లాయిస్ ఎలా విత్ డ్రా చేసుకోవచ్చునో ఒకసారి పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉమంగ్ యాప్ ద్వారా కోవిడ్ 19 అడ్వాన్స్ పొందడమెలా..


ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి 'కోవిడ్ 19 అడ్వాన్స్' పొందాలనుకునేవారు Umang యాప్ ద్వారా ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దాని కోసం కింద ఇవ్వబడిన ప్రొసీజర్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది.


Step 1: మొదట ఉమంగ్ యాప్‌ను ఓపెన్ చేయండి.


Step 2: ఉమంగ్ యాప్‌లో EPFO ఆప్షన్‌పై  క్లిక్ చేయండి.


Step 3: 'Request for Advance (COVID-19)'ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.


Step 4: ఇప్పుడు యూఏఎన్ వివరాలు పొందుపరిచి.. 'ఓటీపీ' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.  


Step 5: ఓటీపీ కోడ్‌ను ఎంటర్ చేసి 'లాగిన్'పై క్లిక్ చేయండి. లాగిన్ తర్వాత మీ బ్యాంకు ఖాతాలోని చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డ్రాప్ డౌన్ మెనూలో మెంబర్ ఐడీని సెలెక్ట్ చేయండి.


Step 6: ఇప్పుడు 'Click on proceed'ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


Step 7: ఇక్కడ మీ చిరునామా ఎంటర్ చేసి 'Next' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


Step 8: ఇక్కడ చెక్ ఇమేజ్‌ను అప్‌లోడ్ చేసి.. అకౌంట్ నంబర్ తదితర వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు ఎంటర్ చేశాక సబ్‌మిట్ ఆప్షన్ ఎంటర్ చేయాలి. అంతే.. కోవిడ్ 19 అడ్వాన్స్‌ క్లెయిమ్ ప్రక్రియ పూర్తయినట్లే.


'కోవిడ్ 19 అడ్వాన్స్‌'కు ఎవరు అర్హులు : 


ఈపీఎఫ్ స్కీమ్‌ 1952 ప్రకారం ఇందులో సభ్యులైన ప్రతీ ఒక్కరూ 'కోవిడ్ 19 అడ్వాన్స్'కు అర్హులే. సభ్యులు తప్పనిసరిగా యూఏఎన్ కలిగి ఉండాలి. ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిమ్‌‌ను 3 రోజుల్లో పొందగలుగుతారు. ఈపీఎఫ్‌వో (EPFO) కల్పించిన 'కోవిడ్ 19 అడ్వాన్స్' సదుపాయాన్ని ఇప్పటివరకూ లక్షలాది మంది ఉపయోగించుకున్నారు. కోవిడ్ 19 అడ్వాన్స్ క్లెయిమ్‌కి సంబంధించి మరిన్ని వివరాలు  ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ ద్వారా epfindia.gov.in తెలుసుకోవచ్చు.


Also Read: KCR on Drugs issue: తెలంగాణ నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా త‌రిమేద్దామన్న సీఎం కేసీఆర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook