Drugs isuue in Telangana: తెలంగాణలో డ్రగ్స్ వాడకాన్ని సమూలంగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణపై స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్‌ను ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టారు. పోలీసు అధికారులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో డ్రగ్స్‌ను (Drugs) అరికట్టాలని ఆదేశించారు.
డ్రగ్స్ విషయంలో వెయ్యి మంది సుక్షితులైన పోలీస్ (Police) సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని.. ఇంటలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు కేసీఆర్. డ్రగ్స్ వ్యవహారంలో పార్టీలతో సంబంధం లేకుండా వ్యవహరించాలన్నారు. డ్రగ్స్ కట్టడిలో భాగంగా ఎంతటి వారినైనా సరే ఉపేక్షించవద్దని కేసీఆర్ పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గద్దని పోలీసు శాఖను ఆదేశించారు. పోలీసు శాఖ మరింత సమర్థంగా పని చేయడానికి నిధుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం కేసీఆర్ (CM KCR) పేర్కొన్నారు.
Also Read: Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మొసలి దాడి.. తెలిసి తెలిసి ప్రాణాల మీదకు..
అలాగే నార్కోటిక్ డ్రగ్స్ వాడకమనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోందని, సమాజం అనే వేరుకు ఇది చీడలాంటిదని కేసీఆర్ అన్నారు. డ్రగ్స్‌ను తెలంగాణ నుంచి పూర్తిగా తరిమేయాలన్నారు. అలాగే ప్రజల్ని డ్రగ్స్‌కు (Drugs) వ్యతిరేకంగా చైతన్యపరిచేందుకు పలు సృజనాత్మక కార్యక్రమాల్ని కూడా రూపొందించాలంటూ సీఎం చెప్పారు. ఇక తెలంగాణలో (Telangana) ఇప్పటికే పలు అసాంఘిక శక్తుల్ని నిర్వీర్యం చేసేందుకుగాను గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థల్ని ఏర్పాటు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు.
Also Read: Success Mantra: ఇలా చేస్తే మీ ఇంట్లో ధనంతో పాటు ఏ లోటు లేకుండా ఉంటుంది!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook