EPFO Interest Rate: ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై ఖాతాదారులకు గుడ్ న్యూస్ రానుందా!
EPFO Board Meeting: కొవిడ్ టైమ్‌లో పీఎఫ్‌పై తగ్గిన వడ్డీ రేట్‌ను మళ్లీ పెంచేందుకు ఒక కీలక సమావేశం త్వరలోనే జరగనుంది. దీంతో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై ఖాతాదారులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుంది.
EPFO Interest Rate: 2021-22 ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్ చేసిన పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ రేటును పెంచేందుకు త్వరలో ఒక కీలక భేటీ జరగనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ.. ఈపీఎఫ్‌వో ఈ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇందులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్.. సీబీటీ వచ్చే నెలలో గౌహతిలో సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే పీఎఫ్ వడ్డీ రేటుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక ఈ సమావేశంపై కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పలు విషయాలు వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్ చేసిన పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ రేటును... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ అంచనా మేరకే పెంచే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఇక భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) హెడ్‌గా కూడా కొనసాగుతున్నారు.
కరోనా కాలంలో పీఎఫ్‌పై వడ్డీ రేటు తగ్గించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాల్లో జమ అయిన మొత్తంపై వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2020లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయాన్ని ఆమోదించారు.
ఈ నిర్ణయం తర్వాత, పీఎఫ్‌పై వడ్డీ రేటు కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరంలో, EPFO 8.65 శాతం వడ్డీని ఇచ్చింది. అంతకుముందు 2013-14 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును 8.75 శాతానికి తగ్గించారు.
కాగా నవంబర్ 2021లో దాదాపు 14 లక్షల మంది కొత్త ఉద్యోగులు చేరారు. గతేడాది కంటే ఇది 38 శాతం ఎక్కువ. అలాగే 2021 అక్టోబర్‌తో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. 2021 సంవత్సరంతో పోల్చితే.. 3.84 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. నవంబర్ 2020 నాటికి ఈపీఎఫ్‌వోలో 10 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులే చేరారు.
Also Read: Lassa fever : యూకేలో 'లస్సా ఫీవర్'తో ముగ్గురు మృతి!
Also Read: Google Rewards: ఇండియన్ టెకికీ గూగుల్ నుంచి రూ. 65 కోట్ల రివార్డు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి