Google Rewards: ఇండియన్ టెకికీ గూగుల్ నుంచి రూ. 65 కోట్ల రివార్డు.. మీకూ ఈ టాలెంట్ ఉందా..

గూగుల్​.. ప్రపంచ సెర్చింజన్​ దిగ్గజంగా వెలుగొందుతోంది. క్రోమ్​, ఆండ్రాయిడ్ సహా అనేక వివిధ సేవల దీని ఆదీనంలోనే పని చేస్తుంటాయి. దీనితో యూజర్ల సేఫ్టీకి చాలా ప్రాధాన్యతనిస్తుంటుంది. ఓ టీమ్ ఎప్పుడూ గూగుల్​ భద్రతకోసం పని చేస్తుంటుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 08:46 PM IST
  • బగ్స్​ గుర్తించిన భారతీయుడికి భారీ రివార్డ్​
  • 2021కి గానూ రూ.65 కోట్ల నజరాన
  • బ్లాగ్​ పోస్ట్​ ద్వారా ప్రకటించిన గూగుల్
Google Rewards: ఇండియన్ టెకికీ గూగుల్ నుంచి రూ. 65 కోట్ల రివార్డు.. మీకూ ఈ టాలెంట్ ఉందా..

Google Rewards: గూగుల్​.. ప్రపంచ సెర్చింజన్​ దిగ్గజంగా వెలుగొందుతోంది. క్రోమ్​, ఆండ్రాయిడ్ సహా అనేక వివిధ సేవల దీని ఆదీనంలోనే పని చేస్తుంటాయి. దీనితో యూజర్ల సేఫ్టీకి చాలా ప్రాధాన్యతనిస్తుంటుంది. ఓ టీమ్ ఎప్పుడూ గూగుల్​ భద్రతకోసం పని చేస్తుంటుంది.

బయటి వ్యక్తులు కూడా గూగుల్​ ప్రోడక్ట్స్​లో లోపాలను గుర్తిస్తే వారికి భారీ రివార్డ్​ ఇస్తుంటుంది. అలా ఎంతో మంది గూగుల్ నుంచి రివార్డ్స్​ పొందుతుంటారు. తాజాగా ఓ భారతీయుడు కూడా ఇలా గూగుల్ నుంచి రూ.65 కోట్ల రివార్డ్​ గెలుచుకున్నాడు. అండ్రాయిడ్​లో లోపాలను గుర్తించి.. దానిని మరింత సురక్షితంగా మార్చేందుకు కృషి చేసినందుకు గానూ ఈ స్థాయిలో రివార్డ్​ ఇచ్చింది గూగుల్​.

ఇండోర్​కు చెందిన అమన్​ పాండే అనే వ్యక్తికి.. లోపలు గుర్తించినందుకు గానూ ఈ రివార్డర్ ప్రకటించింది గూగుల్​.

అమన్​ పాండే గురించి..

అమన్ పాండే ఎన్​ఐడీ భోపాల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. 2019 నుంచి ఇలా గూగుల్​లో లోపాలను గుర్తించి నివేదించడం చేస్తున్నాడు. అలా 2021లో 'బగ్స్​మిర్రర్' పేరుతో సంస్థను ఎథికల్ హ్యాకింగ్ కంపెనీని కూడా ప్రారంభించారు. ఈ సంస్థకు సీఈఓగా కూడా అమన్ పాండేనే వ్యవహరిస్తున్నారు.

ఓ విశేషం ఏమిటంటే.. అమన్ పాండే గత 2021లోనే 232 లోపాలను గుర్తించాడు. ఆండ్రాయిడ్ సహా క్రోమ్​, ప్లే స్టోర్​ ఇతర అన్ని ఉత్పత్తులకు సంబంధించి ఈ లోపాలను గుర్తించారు అమన్ పాండే.

గూగుల్ కూడా లోపాలను గుర్తించే వారిని మరింత ప్రోత్సహించేందుకు రివార్డ్ మొత్తాన్ని పెంచుతూ వస్తోంది. అలా 2020తో పోలిస్తే 2021 రివార్డ్​ మొత్తం 3 మిలియన్​ డాలర్ల వరకు పెంచింది.

Also read: Stock Market today: స్టాక్ మార్కెట్లలో విజృంభించిన బుల్​- ఇటీవలి నష్టాలు రికవరీ!

Also read: Nokia G11 Launch: నోకియా స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు వస్తుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News