EPFO Medical Advance: గంటలో ఈపీఎఫ్‌వో మెడికల్ అడ్వాన్స్‌గా రూ.1 లక్ష సాయం
EPFO Medical Advance: గత ఏడాది అడ్వాన్ కింద మూడు నెలల జీతం తీసుకునేలా ఈపీఎఫ్‌వో చర్యలు చేపట్టింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు అత్యవసర సమయంలో కోవిడ్19 అడ్వాన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగులు కోల్పోయిన ఈపీఎఫ్ ఖాతాదారులకు సైతం అడ్వాన్స్ నగదుకు దరఖాస్తు చేసుకుంటే (EPFO Medical Emergency) తక్కువ సమయంలోనే వాటికి ఆమోదం తెలుపుతుంది.
EPFO Medical Advance: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో తన ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మెడికల్ అడ్వాన్స్ అందిస్తోంది. ఇదివరకే భారీ సంఖ్యలో ఈపీఎఫ్ ఖాతాదారులు నగదును అడ్వాన్స్‌గా తీసుకున్నారు. కరోనా సోకితే వైద్యం కోసం లేదా ఇతరత్రా వైద్య ఖర్చులకు మెడికల్ అడ్వాన్స్ కింద రూ.1 లక్ష వరకు ఈపీఎఫ్ ఖాతాదారులకు అందిస్తోంది.
గత ఏడాది అడ్వాన్ కింద మూడు నెలల జీతం తీసుకునేలా ఈపీఎఫ్‌వో చర్యలు చేపట్టింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు అత్యవసర సమయంలో కోవిడ్19 అడ్వాన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగులు కోల్పోయిన ఈపీఎఫ్ ఖాతాదారులకు సైతం అడ్వాన్స్ నగదుకు దరఖాస్తు చేసుకుంటే తక్కువ సమయంలోనే వాటికి ఆమోదం తెలుపుతుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు తమకు లేదా కుటుంబసభ్యులకు కరోనాకు చికిత్స కోసంగానీ, లేదా ఇతరత్రా అనారోగ్య సమస్యలకు చికిత్స పొందడానికి ఆసుపత్రిలో చేరితే రూ.1 లక్ష వరకు మెడికల్ అడ్వాన్స్ (EPF Withdrawal Conditions) సాయం చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న గంటల వ్యవధిలో లక్ష రూపాయాలను ఎలాంటి బిల్లులు సమర్పించకుండానే ఈపీఎఫ్ ఖాతాదారుడి బ్యాంకు ఖాతాకు ఈపీఎఫ్‌వో జమ చేయనుంది.
Also Read: EPFO Benefits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి
ఈపీఎఫ్ ఖాతాదారుడుగానీ, లేక వారి కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేరితే మెడికల్ అడ్వాన్స్ తీసుకోవడానికి కొన్ని మార్గదర్శకాలను ఈపీఎఫ్‌వో జారీ చేసింది.
ఈపీఎఫ్ ఖాతాదారులు లేదా వారి కుటుంబసభ్యులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగానికి చెందిన ఆసుపత్రి విభాగాలు లేదా సీజీహెచ్‌ఎస్ ప్యానెల్ ఆసుపత్రులలో చికిత్స కోసం చేరాలి. ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లయితే సంబంధించి EPFO అధికారి విచారణ జరిపి మెడికల్ అడ్వాన్స్ జారీ చేసేందుకు అనుమతి ఇవ్వాలి.
ఈపీఎఫ్ ఖాతాదారులు లేదా వారి కుటుంబ సభ్యులుగానీ పేషెంట్ పేరు, వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. అందులో మెడికల్ అడ్వాన్స్ (Medical Advance For EPF Account Holders) అంచనా వ్యయం పేర్కొనాల్సిన అవసరం లేదు.
Also Read: EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, జాబ్ కోల్పోయినా COVID-19 అడ్వాన్స్ నగదు సాయం
ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు లేదా వారి కుటుంబ సభ్యులు మెడికల్ అడ్వాన్స్‌కు దరఖాస్తు చేసిన ఒక గంట సమయంలోగా లక్ష రూపాయల మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు.
మే నెలలో ప్రవేశపెట్టిన కోవిడ్19 అడ్వాన్స్‌కు ఇది పూర్తిగా భిన్నమైనది. ఈఫీఎఫ్ కోవిడ్19 అడ్వాన్స్ కింద పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో 75 శాతం నగదును అందజేస్తారు. అయితే ఆ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాదారుడు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: EPF Interest Money: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, త్వరలో మీ ఖాతాల్లో వడ్డీ జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook