EPFO: ఈపీఎఫ్ నగదును ఖాతాదారులు పాత అకౌంట్ నుంచి ఇలా Transfer చేసుకోవచ్చు

How To Transfer EPF Balance : ఈపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో జాబ్ మారే సమయంలో సగం ఇబ్బందులుంటాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆన్‌లైన్ వేదికగా EPF నగదు బదిలీ చేసుకోవడం తేలిక అయింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 29, 2021, 12:07 PM IST
EPFO: ఈపీఎఫ్ నగదును ఖాతాదారులు పాత అకౌంట్ నుంచి ఇలా Transfer చేసుకోవచ్చు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాల ద్వారా పలు సేవలు అందిస్తుంది. ఉద్యోగులకు భవిష్య నిధిగా పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తుంది. ఇంటి కోసం రుణాలు చేయాలన్నా, పెళ్లి, ఆరోగ్య, తదితర ఖర్చులకు సైతం మీరు EPF ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో జాబ్ మారే సమయంలో సగం ఇబ్బందులుంటాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆన్‌లైన్ వేదికగా EPF Balance నగదు బదిలీ చేసుకోవడం తేలిక అయింది. ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో పాత కంపెనీలు మాజీ ఉద్యోగికి పీఎఫ్ నగదు బదిలీ విషయంలో వివరాలు అంతగా తెలపవు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌వో నగదును కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే సదుపాయాన్ని తమ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ కల్పించింది. 

Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ను ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోండి

ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదును కొత్త కంపెనీ పీఎఫ్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే మీకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (Universal Account Number), ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ మీకు తెలిసి ఉండాలి. మీ పీఎఫ్ ఖాతాకు మొబైల్ నెంబర్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటి వివరాలు అనుసంధానమై ఉంటే కొత్త సమస్యలు ఉత్పన్నం కావు. పీఎఫ్ బ్యాలెన్స్ బదిలీ చేసుకునే విధానం ఇక్కడ తెలియజేస్తున్నాం. 

ఈపీఎఫ్ నగదు కొత్త పీఎఫ్ ఖాతాకు బదిలీ చేసుకునే విధానం..
- ఈపీఎఫ్ ఖాతాదారుడు మొదటగా EPFO వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేయాలి.

- ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో యూఏఎన్ ఖాతా వివరాలతో లాగిన్ అవ్వాలి

-  ఆ తరువాత Members Profile మీద క్లిక్ చేసి మీ పేరు ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటి వివరాలు ధ్రువీకరించుకోవాలి. 

- ఒకవేళ మీ పాస్‌బుక్ వివరాలు చెక్ చేసుకోవాలనుకుంటే Passbook కోసం మరోసారి లాగిన్ అవ్వాలి. మీ ఈపీఎఫ్ ఖాతాలో నగదు వివరాలు చెక్ చేసుకోవాలి.

- Service History ఆప్షన్‌కు వెళ్లి పాత సంస్థలో ఉద్యోగం సహా వ్యక్తిగత వివరాలు ధ్రువీకరించుకోవాలి. 
 
- Online Services ఆప్షన్‌కు వెళ్లి అందులో One Member - One EPF Account మీద క్లిక్ చేయాలి. ఆపై Get details ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పాత కంపెనీలో మీ పీఎఫ్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. 

Also Read: EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో మాత్రమే Cash విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది

- మారు జాబ్ మానేసిన కంపెనీ డేట్ ఆఫ్ ఎగ్జిట్‌ను అప్‌డేట్ చేసి ఉండాలి. లేదంటే జాబ్ మానేసిన రెండు నెలల తరువాత మీరే ఎగ్జిట్ డేట్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

- గతంలో పనిచేసిన కంపెనీల వివరాలు కనిపించిన తరువాత, మీ యూఏఎన్ వివరాలు నమోదు చేయాలి. ఆపై మీరు ఏ ఆఫీసు పీఎఫ్ ఖాతా నుంచి నగదు బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి. Get OTP మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి, ఆపై సబ్మిట్ చేస్తే PF Transfer ప్రక్రియ పూర్తవుతుంది.

- ద క్లెయిమ్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ (THE CLAIM HAS BEEN SUCCESSFULLY SUBMITTED) అని మీకు మెస్సేజ్ వస్తుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోండి. మీ పీఎఫ్ నగదు బదిలీ ప్రక్రియకు సంబంధించి ప్రింటౌట్ తీసుకుని మీ ఆఫీసుకు పంపిస్తారు. వారు ఆమోదం కోసం పీఎఫ్ ఆఫీసుకు పంపుతారు.

- 7 నుంచి 10 రోజులలో మీ పీఎఫ్ పాస్‌బుక్‌లో బదిలీ అయిన పీఎఫ్ నగదు వివరాలు కనిపిస్తాయి. 

Also Read: EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News