EPFO New Members: రికార్డుస్థాయిలో పెరిగిన ఈపీఎఫ్‌ఓ సభ్యుల సంఖ్య.. ఒక్క నెలలోనే 14.93 లక్షల మంది చేరిక
Employee Provident Fund: ఈపీఎఫ్‌ఓ సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది డిసెంబర్ నెలలో మొత్తం 14.93 లక్షల మంది చేరినట్లు పేరోల్ డేటా వెల్లడించింది. 10.74 లక్షల మంది సభ్యులు ఉద్యోగాలు మారినట్లు పేర్కొంది. కొత్తగా చేరిన సభ్యులలో 55.64 శాతం మంది 18-25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారే ఉన్నారు.
Employee Provident Fund: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) గతేడాది డిసెంబర్ నెలలో మొత్తం 14.93 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. పేరోల్ డేటా ప్రకారం.. గత సంవత్సరం డిసెంబర్‌లో నికర మెంబర్‌షిప్ వృద్ధి 2021తో పోలిస్తే.. పోలిస్తే 32,635 పెరిగింది. సోమవారం విడుదల చేసిన ఈపీఎఫ్ తాత్కాలిక పేరోల్ డేటా డిసెంబర్ నెలలో యాడ్ చేసిన 14.93 లక్షల మంది సభ్యులలో.. 8.02 లక్షల మంది కొత్త సభ్యులు మొదటిసారిగా ఈపీఎఫ్‌ఓ సామాజిక భద్రతా పరిధిలోకి వచ్చారు.
కొత్తగా చేరిన సభ్యులలో 2.39 లక్షల మంది 18-21 సంవత్సరాల వయస్సు గల వారే ఉన్నారు. 22-25 సంవత్సరాల వయస్సు గల వారిలో 2.08 లక్షల మంది సభ్యులు ఉన్నారు. డిసెంబరులో చేరిన మొత్తం కొత్త సభ్యులలో 55.64 శాతం మంది 18-25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారేనని పేరోల్ డేటా వెల్లడించింది. ఈపీఎఫ్‌లో చేరిన చాలా మంది సభ్యులు దేశంలోని సంఘటిత రంగ వర్క్‌ఫోర్స్‌లో చేరిన మొదటిసారి చేరిన ఉద్యోగులే ఉన్నారు.
దాదాపు 3.84 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓ సభ్యులు నిష్క్రమించారు. 10.74 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓ సభ్యత్వం నుంచి నిష్క్రమించి తిరిగి చేరినట్లు డేటా వెల్లడించింది. ఈ సభ్యులు తమ ఉద్యోగాలను మార్చుకున్నారు. మళ్లీ ఈపీఎఫ్‌ఓ కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరారు. పేరోల్ డేటా విశ్లేషణ ప్రకారం.. డిసెంబర్‌లో కొత్త మహిళా సభ్యుల నమోదు 2.05 లక్షలు అని వెల్లడైంది. కొత్త మహిళా సభ్యుల శాతం అంతకుముందు నవంబర్‌లో 25.14 శాతం నుంచి కొత్తగా చేరినవారిలో 25.57 శాతానికి పెరిగింది. ఉద్యోగుల భవిష్య నిధి, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం మొదటిసారిగా ఈ మహిళా సభ్యులకు సామాజిక భద్రత కల్పించారు.
రాష్ట్రాల వారీగా డేటాను పరిశీలిస్తే.. కొత్త సభ్యులను చేర్చుకున్న జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, హర్యానా ఆ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో కంటే మొత్తం సభ్యుల చేరికలలో మహారాష్ట్ర 24.82 శాతంతో ముందంజలో ఉంది. తమిళనాడు 10.08 శాతంతో రెండో స్థానంలో ఉంది. పరిశ్రమల వారీగా గణాంకాలను గత నెలతో పోలిస్తే.. ఫైనాన్సింగ్ సంస్థలు, బీడీ తయారీ, వర్తక-వాణిజ్య సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు మొదలైన పరిశ్రమలలో అత్యధికంగా ఉద్యోగులు చేరినట్లు పేరోల్ డేటా వెల్లడించింది.
Also Read: Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే.. ఆ ప్లేయర్ ఎంట్రీతో మరింత పవర్‌ఫుల్
Also Read: PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్యగమనిక.. మీ ఖాతాలో నగదు ఎప్పుడు జమకానుందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook