EPFO : అతి త్వరలోనే సుమారు 7 కోట్ల మంది EPFO ​​సభ్యులకు గుడ్ న్యూస్ లభించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) డిపాజిట్లపై వడ్డీ పెంచే దిశగా కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు కార్మిక సంఘాలు, పెన్షన్ సంఘాలు ఈపీఎఫ్ ను డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం EPFO 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇప్పుడు  పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EPFO గతంలో 8.15% నుండి 2023-24కి వడ్డీ రేటును 8.25%కి పెంచింది. ఇప్పుడు పీఎఫ్ వడ్డీ  మరోసారి పెంచే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో తమ మూలధనం పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), EPFO ​​నిర్ణయాధికార సంస్థ, పీఎఫ్‌పై వార్షిక వడ్డీని 8.15 శాతం నుంచి 8.25 శాతానికి పెంచింది. 


Also Read: Farmers pension scheme: ఈ ఒక్క పని చేయండి చాలు..ప్రతినెలా రూ. 3,000 పొందే ఛాన్స్


మార్చి 2022 లో  EPFపై వడ్డీ నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1 శాతానికి తగ్గించారు. ఇది అంతకు ముందు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతంగా ఉంది.  మళ్లీ ఇప్పుడు కూడా 8.5% వడ్డీ పెంచే అవకాశం ఉందని  నిపుణులు అంచనా వేస్తున్నారు. 


ఇదిలా ఉంటే  2018-19కి ఈపీఎఫ్ వడ్డీ శాతం 8.65 శాతంగా ఉండేది.  EPFO తన కస్టమర్లకు 2016-17లో 8.65 శాతం  2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. కాగా 2015-16లో వడ్డీ రేటు అత్యధికంగా 8.8 శాతంగా ఉంది. ఇది కాకుండా, EPFO ​​2013-14, 2014-15లో 8.75 శాతం వడ్డీ రేటును ఉంది.  కానీ అప్పటినుంచి క్రమంగా వడ్డీ రేటు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం మాత్రం ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. 


ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పీఎఫ్ ఖాతాపై ఈపీఎఫ్‌ఓ ప్రతి సంవత్సరం వడ్డీ రేటును ప్రకటిస్తుంది. దాదాపు 7 కోట్ల మంది ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. EPFO వడ్డీని నిర్ణయించిన తర్వాత, ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాపై వడ్డీ సంవత్సరానికి ఒకసారి మార్చి 31న చెల్లిస్తారు.


Also Read:  Gold Rate Today: సెప్టెంబర్ 23 సోమవారం బంగారం ధరలు..నేడు తులం బంగారం ధర ఎంతంటే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.